జయ పార్థీవదేహాన్ని చూసి రజినీ కంటతడి: ప్రముఖుల నివాళి(వీడియో)
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని చూసి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. రాజాజీ హాల్లోని ఆమె భౌతికకాయానికి మంగళవారం ఉదయం రజినీకాంత్ తన కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. జయను చూసిన రజినీకాంత్ బావోద్వేగాన్ని అపుకోలేక కంటతడి పెట్టారు. ఆయన వెంట భార్య లత, కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌లు కూడా ఉన్నారు.
నివాళులర్పించిన అనంతరం రజినీకాంత్ అక్కడే ఉన్న జయ నెచ్చెలి శశికళ వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చారు. కాసేపటి తర్వాత రజనీకాంత్ కుటుంబం అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇది ఇలా ఉండగా, గవర్నర్ విద్యాసాగర్, రావు, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్, డీఎండీకే అధినేత విజయకాంత్‌లు జయ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఈ సందర్భంగా సుమితా మహాజన్ అన్నారు. లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు చెన్నైకి చేరుకుంటున్నారు.

కాగా, జయలలిత ప్రత్యర్థి డీఎంకే నేత కరుణానిధి కుటుంబసభ్యులు కూడా జయలలితకు నివాళులర్పించి వెళ్లారు. ఉదయాన్నే విపక్ష నేత, కరుణ చిన్న కుమారుడు ఎంకె స్టాలిన్ రాజాజీ హాలు వద్దకు వచ్చి జయకు నివాళులర్పించారు. అక్కడున్న ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ, ఇతర అన్నాడీఎంకే నేతలు, మంత్రులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. దేశం ఒక విలక్షణ నేతను కోల్పోయిందని, ఆమె మరణం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికి కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా జయ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అక్కడున్న అన్నాడీఎంకే నేతలను పలుకరించి వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. శశికళను కూడా పలకరించి ఓదార్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు జయలలిత చేసిన సేవలను కొనియాడారు. ఆమె ప్రజల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోతారని తెలిపారు. సినీ నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బు కూడా జయకు నివాళులర్పించారు.
జయలలితకు వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ జయకు నివాళులర్పించారు. నడిగర్ సంఘం అధ్యక్షులు, నటుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, సినీ నటులు కోవై సరళ, టి రాజేందర్, శివకార్తీకేయన్ తదితర సినీ ప్రముఖులూ, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా జయలలితకు నివాళులర్పించారు. కాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం ఉదయం నుంచీ జయ పార్థీవదేహం వద్దనే ఉన్నారు. మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా వేదికగా జయ మృతికి నివాళులర్పించారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications