సెన్సార్ చీఫ్‌ని గద్దె దింపుతా, నేనే బెస్ట్: రాఖీ సావంత్
ముంబై: ప్రముఖ నటి రాఖీ సావంత్ సెన్సార్ బోర్డు పైన మండిపడింది. సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ, నటి సన్నీ లియోనీలను ఆమె లక్ష్యంగా చేసుకుంది. రాఖీ సావంత్ కథానాయికగా నటించిన చిత్రం 'ఏక్ కహానీ జూలీ కీ'.
ఇటీవల సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఏ సర్టిఫికెట్‌గా మార్చింది. దాంతో సెన్సార్ బోర్డ్ పైన రాఖీ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పహ్లజ్‌ని సెన్సార్ బోర్డు చీఫ్ పదవి నుంచి దింపుతానని చెప్పింది.

అతను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి అని మండిపడింది. ఈ సెన్సార్ బోర్డ్‌ని మూసేయాలని, వాళ్లు పెద్ద నిర్మాతల నుంచి డబ్బులు తీసుకుంటూ చిన్న నిర్మాతల్ని హేళన చేస్తున్నారని, సెన్సార్ బోర్డులో ఉన్నవారంతా చదువు లేని వారేనన్నారు.
పహ్లాజ్ నిహలానీ కంటే నేనే ఆ పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలనని పేర్కొన్నారు. మేము అతనికి డబ్బు ఇవ్వనందుకే మాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో, లేక ఐటం సాంగ్స్ చేసే నేను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించానని అలా చేశారో తెలీడం లేదన్నారు. నేనో భారతీయురాలినని, బాలీవుడ్ నటిని, ఐటం గర్ల్‌ని అని, అంతేకానీ పోర్న్‌స్టార్‌ని మాత్రం కాదని పరోక్షంగా సన్నీలియోన్ పైన మండిపడ్డారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications