పాకిస్తాన్‌ను పొగిడిన నటి రమ్య, దుమ్మెత్తిపోసిన నెటిజన్లు
బెంగళూరు: ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రమ్య పాకిస్తాన్ పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె పాక్‌ను పొగుడుతూ స్పందించారు. ఇటీవల ఆమె పాక్‌లో పర్యటించి వచ్చారు.
అనంతరం ఆ దేశాన్ని పొగిడారు. పాకిస్థాన్‌లో పరిస్థితులు బాగున్నాయని, అది చాలా మంచి దేశమని కితాబిచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురి అవుతున్నాయి. ఆమె కొద్ది రోజుల క్రితం పాక్ వెళ్లి, అక్కడో కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చారు.
అనంతరం మాండ్యలో మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్‌కు వెళ్తే నరకానికి వెళ్లినట్లు ఉంటుందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఆయనలా పేర్కొనడం సరికాదని, భారత దేశంలో ప్రజలు ఎలా నివసిస్తున్నారో, పాకిస్తాన్‌లోను అలాగే ప్రజలు ఉన్నారన్నారు.

అది చాలా మంచి దేశమన్నారు. పాకిస్తాన్ వెళ్లిన వారిని బాగా చూసుకుంటారని కితాబిచ్చారు. రమ్య వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై మండిపడుతున్నారు.
తీవ్ర విమర్శల నేపథ్యంలో రమ్య ట్విట్టర్లో స్పందించారు. తాను ప్రధాని మోడీని వ్యతిరేకించలేదన్నారు. అయితే, కొన్ని అంశాలలో తాను విభేదించానన్నారు. పాకిస్తాన్‌లో తమలాంటి ప్రముఖులను బాగా చూసుకున్నారని మాత్రమే తాను చెప్పానని అన్నారు.












Click it and Unblock the Notifications