వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజ్ఞాతంలో అభ్యర్థి, ప్రచారం చేస్తున్న కార్యకర్తలు, నేతలు, మాయా, అఖిలేశ్ కూడా ..

|
Google Oneindia TeluguNews

మావు : ఎన్నికల్లో రకరకాల చిత్రాలు, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. లైంగికదాడి నిందితుడు, బీఎస్పీ అభ్యర్థి ఆజాతంలో ఉన్నారు. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం అతినికే ఓటేయాలని కోరుతున్నారు.

కనిపించని అభ్యర్థి

కనిపించని అభ్యర్థి

యూపీలోని గోసి నుంచి బీఎస్పీ అభ్యర్థి అతుల్ రాయి బరిలోకి దిగారు. ఇక్కడ ఎస్పీ, బీఎస్పీ కూటమిగా ఏర్పడి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 1 నుంచి అభ్యర్థి రాయి కనిపించడం లేదు. దీనికి కారణం అతనిపై లైంగిక దాడి కేసు నమోదు కావడమే. దీంతో అతని మద్దతుదారులు విజయం కోసం కష్టపడుతున్నారు. అంతేకాదు రాయ్ పై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.

మాయా ... అఖిలేశ్ కూడా ...

మాయా ... అఖిలేశ్ కూడా ...


నేతలు, అనుచరుల సంగతి వదిలేస్తే .. బీఎస్సీ అధినేత్రి మాయావతి కూడా రాయ్ కోసం ప్రచారం చేస్తున్నారు. ఆమెతోపాటు ఎస్పీ అధినేత అఖిలేశ్ కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. రాయ్ కి ఓటేయాలని ప్రజలను మాయావతి కోరారు. అతుల్ రాయ్ ని బీజేపీ కుట్రదారుడిగా నిందించిందని పేర్కొన్నారు. మీరు వేసే ఓటుతో రాయ్ గెలిచి .. కుట్ర కేసు నుంచి బయటపడుతారని చెప్తున్నారు.

 కేసు నమోదు ...

కేసు నమోదు ...

మే 1న రాయ్ పై వారణాసి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఓ విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు కట్టారు. అయితే తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో రాయ్ కనిపిచండం లేదు. ఎన్నికలు ఉన్నా కనీసం ప్రచారం కూడా చేయడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన మలేషియా వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీచేశారు.

క్యాంపెయిన్ కంటిన్యూ

క్యాంపెయిన్ కంటిన్యూ


ఇంత జరుగుతున్నా రాయ్ మద్దతుదారుల ప్రచారం మాత్రం చేస్తున్నారు. రాయ్ కోసం తాము ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే రాయ్ వస్తే అరెస్ట్ చేస్తారనే భయంతో రావడం లేదని చెప్తున్నారు. లైంగికదాడి కేసు అంశంపై రాయ్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. మే 23 వరకు అరెస్ట్ చేయొద్దని పిటిషన్ లో కోరారు. అయితే వేకేషన్ బెంచ్ ఎల్లుండి పిటిషన్ ను విచారిస్తామని పేర్కొన్నది. ఆ తర్వాత రెండురోజులకే పోలింగ్ జరగనుండటంతో .. ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

English summary
At a Mahagathbandhan rally in Uttar Pradesh's Mau, a candidate is missing from the campaign scene. Atul Rai, a Bahujan Samaj Party candidate from Ghosi has been missing since a fortnight after a complaint was registered against him in a rape case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X