అత్యాచారం కేసులో మాజీ ఎంఎల్ఏకి పదేళ్ల జైలు శిక్ష
లక్నో: అత్యాచారం కేసులో మాజీ శాసన సభ్యుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. మాజీ శాసన సభ్యుడికి రూ. ఒక లక్ష జరిమానా విధిచారు. ఇదే కేసులో ఇద్దరికి జైలు శిక్ష పడింది. మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేశారు.
2010లో బీఎస్పీ శాసన సభ్యుడు పురుషోత్తం నరేష్ ద్వివేది ఇంట్లో అప్పట్లో 17 సంవత్సరాలు ఉన్న యువతి పని చేసేది. ఆ సందర్బంలో ఇంటిలో ఎవరులేని సమయంలో నరేష్ ద్వివేది యువతి చోరి చేసిందని, పారిపోతుందని ఆరోపిస్తూ ఇంటిలో నిర్బందించారు.

అనంతరం బాలిక మీద ముగ్గురు అత్యాచారం చేశారు. అదే సమయంలో మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి మాయవతి శాసన సభ్యుడు నరేష్ ను సస్పెండ్ చేసి కేసు సీబీసీఐడికి అప్పగించారు. అనంతరం సుప్రీం కోర్టు సూచన మేరకు కేసు సీబీఐకి అప్పగించారు.
కేసు విచారణ జరిగింది. మాజీ శాసన సభ్యుడు నరేష్ ద్వివేది అత్యాచారం చేశాడని రుజువు కావడంతో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇదే కేసులోని నిందితులు రాం నరేష్, వీరేంద్రకుమార్ శుక్లాలకు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.2 వేలు చొప్పున అపరాధ రుసుం విధించారు.
ఈ అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న రాజేంద్ర శుక్లా, సురేష్ లను నిర్దోషులుగా విడుదల చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వీకే శ్రీవాస్తవ ఆదేశాలు జారీ చేశారు. తన మీద చోరీ కేసు నమోదు చేసి అత్యాచారం చేసిన మాజీ శాసన సభ్యుడికి సరైన శిక్ష పడిందని బాధితురాలు అంటున్నారు.












Click it and Unblock the Notifications