ఇస్లాం లోకి మారాలంటూ.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఎక్కడంటే ?
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై లైంగిక దాడికి పాల్పడి, మతమార్పిడి కోసం బెదిరించిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అక్కాచెల్లెళ్లైన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులపై.. ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడి, అనంతరం వారిని వీడియోల ద్వారా బ్లాక్‌మెయిల్ చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో ఒకరు చేసిన ఫిర్యాదు ఆధారంగా, నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాధిత యువతి 2022లో కాలేజీలో చదువుతున్న సమయంలో ఫర్హాన్ అనే యువకుడితో స్నేహం ఏర్పడింది. ఓ రోజు ఫర్హాన్ ఆమెను జహంగీరాబాద్ లోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ సమయంలో వారి మధ్య జరిగిన శృంగారాన్ని రహస్యంగా వీడియో తీశాడు. ఆ తర్వాత ఈ వీడియోను చూపించి ఫర్హాన్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. మతం మారి, ఇస్లాం మత ఆచారాలను అనుసరించాలని లేకుంటే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది.

అంతటితో ఆగకుండా, బాధితురాలి చెల్లిని కూడా లక్ష్యంగా చేసుకుని, మత్తు మందులు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇద్దరూ మత్తు పదార్థాలు ఇచ్చి, వారిని బలవంతంగా లైంగిక చర్యలకు గురిచేసినట్లు సమాచారం. బాధితులు చాలా కాలం పాటు మౌనంగా ఉండిపోయినా, చివరకు ఓ నమ్మకమైన వ్యక్తి ద్వారా విషయం బయటకు వచ్చింది. పోలీసుల దర్యాప్తులో నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని, మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. బాధిత మహిళలకు కౌన్సిలింగ్ అందిస్తూ, వారి వివరాలను గోప్యంగా ఉంచారు.
ప్రస్తుతం కేసు విషయంలో లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 376, 354, 506 సహా మత మార్పిడి నిషేధ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటన దేశంలో పెరుగుతున్న మహిళలపై లైంగిక దాడులు, మత సంబంధిత బెదిరింపుల విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచిస్తుంది. నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి చేయడం కాకుండా.. మతం అడిగి వివరాలు తెలుసుకొని మరీ దారుణంగా చంపడం పట్ల తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తంఅవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఘట మరింత హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications