Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చరిత్రలో నిలిచిపోయే రతన్ టాటా ఛారిటీ.. వీలునామాలో ఆసక్తికర విషయాలు!

భారతదేశపు దిగ్గజ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతా మూర్తి రతన్ టాటా గత సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా రాసినటువంటి వీలునామా ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వేల కోట్ల సామ్రాజ్యాధిపతి అయిన రతన్ టాటా మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి అని ఆయన వీలునామాను బట్టి అర్థమవుతుంది.

రతన్ టాటా వీలునామాలో సింహభాగం దానికే
రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాలని నిర్ణయించినట్లు జాతీయ మీడియాలో కథనాలు ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఘనమైన వారసత్వాన్ని ఖండాంతరాలకు విస్తరించిన రతన్ టాటా ఆయన మరణానంతరం తనకున్న దాదాపు పదివేల కోట్ల ఆస్తులలో సింహభాగాన్ని చారిటీ కోసం కేటాయించడం ప్రధానంగా కనిపిస్తుంది. చారిటీకి 3,800 కోట్ల రూపాయలను కేటాయిస్తూ అయిన వీలునామా రాశారు.

Ratan Tata charity that will remains forever in history Interesting things in the will

వీలునామాలో టాటా సన్స్ షేర్లపై చెప్పిందిదే
తన పేరుతో ఉన్న ఎండోమెంట్ ఫౌండేషన్, ట్రస్ట్ లకు రతన్ టాటా ఆ నిధులను వెచ్చించాలని వీలునామాలో పేర్కొన్నారు. అంతేకాదు టాటా సన్స్ లో ఆయనకు ఉన్న వాటాలతో పాటు ఇతర ఆస్తులు కూడా అందులో ఉన్నాయి. ఇక టాటా సన్స్ లో ఆయనకు ఉన్న షేర్లను అమ్మాల్సి వస్తే బయట ఉన్న వాళ్లకు అమ్మ కూడదని ప్రస్తుతం ఉన్న వాటాదారులకు అమ్మాలని కూడా వీలునామాలు పేర్కొన్నారు.

వారికి 800 కోట్ల ఆస్తులు రాసిచ్చిన రతన్ టాటా
వీరికి మాత్రమే కాదు తనకు దగ్గర బంధువులకు, తన వద్ద పనిచేసిన వారికి, తన చుట్టుపక్కల ఉండే వారికి ఎంతో మందికి రతన్ టాటా వీలునామాలో ఆస్తులను రాశారు.
తన సవతి సోదరీమణులు అయిన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ లకు రతన్ టాటా ఎనిమిది వందల కోట్ల విలువ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్, ఖరీదైన వాచ్లు, పెయింటింగ్స్ ఇచ్చారు.

సన్నిహితులను, స్నేహితులను మరచిపోని రతన్ టాటా
ఇక టాటా గ్రూప్ లో పనిచేసిన మాజీ ఉద్యోగి, రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన మోహిన్ ఎం దత్తాకు ఎనిమిది వందల కోట్ల విలువచేసే ఆస్తులను రతన్ టాటా ఇచ్చారు.
అంతేకాదు అలీ బాగ్ లోని బంగ్లా, మూడు పిస్టల్ లను తన ప్రియమిత్రుడు అయిన మెహిల్ మిస్త్రీ పేరు మీద రాశారు.

సోదరుడికి ఆస్తులు, తన కేర్ టేకర్ ను మరువని రతన్ టాటా
రతన్ టాటా కు చెందిన జుహూ లోని బంగ్లాలో షేర్ తో పాటు, కొన్ని వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను తన సోదరుడు అయిన జిమ్మీ నావల్ కు ఇచ్చారు. జీవిత చరమాంకంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడు కు ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారు. రతన్ టాటాకు కేర్ టేకర్ గానూ, జనరల్ మేనేజర్ గానూ శంతను నాయుడు వ్యవహరించారు.

పొరుగింటి వ్యక్తికి సాయం
దీంతో తన కోసం సేవలందించిన యువ మిత్రుడికి ప్రేమతో తనవంతుగా సాయం చేశారు. అంతేకాదు తన పొరుగు ఇంట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి ఆయన ఇచ్చిన 23 లక్షల రూపాయల అప్పును రద్దు చేశారు. రతన్ టాటాకు మూగజీవాలు అంటే ఎనలేని ప్రేమ . వీధి శునకాల సంరక్షణ కోసం ఆయన ఆసుపత్రులను కూడా నిర్మించారు.

జంతు ప్రేమతో వాటి కోసం ఫండ్
అంతేకాదు వీలునామా లోను పెంపుడు జంతువులను మరిచిపోకుండా వాటి సంరక్షణ కోసం రతన్ టాటా పండును ఏర్పరిచారు. మొత్తం 12 లక్షల రూపాయల ఫండ్ పక్కనపెట్టి మూడు నెలలకు ఒకసారి 30 వేల రూపాయల చొప్పున వాటికి ఖర్చు చేసేలా నిధులు ఇచ్చారు. వీలునామాలో ఆయన పెంపుడు జంతువులను కూడా మరచిపోలేదు.

విదేశాలలో రతన్ టాటాకు విలువైన ఆస్తులు
ఇదిలా ఉంటే విదేశాలలో కూడా రతన్ టాటాకు చాలా విలువైన ఆస్తులు ఉన్నాయి. మొత్తం 40 కోట్ల విలువైన ఆస్తులు వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. వెల్స్ ఫార్గో, మోర్గాన్ స్టాన్లీ వంటి ఆర్థిక సంస్థలలో బ్యాంకు ఖాతాలు, ఆల్కోవా కార్పొరేషన్, హౌమెట్ ఏరోస్పేస్ వంటి కంపెనీలలో షేర్లు ఉన్నాయి. మొత్తం ప్రముఖ బ్రాండ్లకు చెందిన 65 ఖరీదైన చేతి గడియారాలు ఆయనకు ఉన్నాయి.

ఫిబ్రవరి 23 2022న వీలునామా రాసిన రతన్ టాటా
రతన్ టాటా తన విలువైన ఆస్తులకు సంబంధించిన వీలునామాను ఫిబ్రవరి 23 2022న రాశారు. వీలునామాలో ఏ ఒక్కరినీ మరచిపోకుండా ఆయన గుర్తు పెట్టుకున్నారు. అయితే ఆయన రాసిన వీలునామాను పరిశీలించి తదనుగుణంగా ఆస్తుల కేటాయింపులు చేయాలని ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఈ ఆస్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

రతన్ టాటా ఔన్నత్యం చాటుతున్న వీలునామా
ఏది ఏమైనప్పటికీ రతన్ టాటా అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన సంపాదించిన ఆస్తులలో సింహభాగాన్ని సేవా కార్యక్రమాల కోసం కేటాయించడం ఆయన ఔన్నత్యాన్ని చాటుతుంది.టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాను ప్రతీ ఒక్కరూ ఎప్పటికీ స్మరించుకునేలా చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+