రాజీనామాల పర్వం: ప్రకాశ్ జావదేకర్, రవిశంకర్ ప్రసాద్ కూడా, రాష్ట్రపతి ఆమోదం
కేంద్రమంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోడీతో సన్నిహితంగా ఉన్న, ముఖ్య నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే హర్షవర్ధన్, రమేశ్ పొఖ్రియాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావదేకర్ కూడా చేరారు. వారిద్దరీ రాజీనామా కాస్త కలవరానికి గురిచేస్తోంది. కీలక శాఖలు చూస్తున్న కేంద్రమంత్రులు రాజీనామా జీర్ణించుకోలేని పరిస్థితి.. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో మాత్రం తప్పలేదు.
Recommended Video
జావదేకర్, రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేయగా.. రాష్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం కూడా తెలిపారు. వీరితో కలిపి రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య 12కి చేరింది. రవిశంకర్ ప్రసాద్ కీలకమైన ఐటీ శాఖ చూస్తుండగా.. జావదేకర్ పర్యావరణశాఖను చూస్తున్నారు. గత మంత్రివర్గ విస్తరణలో జావదేకర్‌కు ప్రమోషన్ వచ్చిన సంగతి తెలిసిందే. మలి విడతలో ఆయన బెర్త్ ఖాళీ చేయాల్సి వచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో వీరి సేవలను పార్టీ వాడుకోబోతుంది.

కొత్తగా 43 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిలో ప్రమోషన్ వచ్చిన వారు ఒకరిద్దరూ ఉంటారు.. మిగతావారు అందరూ కొత్తవారే. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి పెద్దపీట వేస్తారు. గుజరాత్ నుంచి కూడా ఎక్కువమంది మంత్రులు ఉంటారు. మోడీ సొంత రాష్ట్రం కాబట్టి అదీ కంటిన్యూ అవుతూనే ఉంది. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటకకు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications