30 రేప్‌లు, హత్యలు: సీరియల్ కిల్లర్ ఆపరేషన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోనూ పరిసరాల్లోనూ 30మందికి పైగా పిల్లలపై అత్యాచారాలు చేసి, వారిని హత్య చేసిన రవీందర్ కుమార్ వ్యవహారం విని పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు. రవీందర్ కుమార్ నేరాల తీరును, చిట్టాను విని తాను షాక్ తిన్నానని దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ పోలీసు కమిషనర్ విక్రమజిత్ సింగ్ అన్నారు.
కుమార్ చేతిలోని బాధితులంతా 14 ఏళ్ల లోపు పిల్లలే కావడం విశేషం. 24 ఏళ్ల కుమార్ మొదటి నేరాన్ని 17 ఏళ్ల వయస్సులో చేశాడు. ఢిల్లీ మెట్రో రైలు నిర్మాణం పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నవారి కూతురిని ఎత్తుకెళ్లి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత హత్య చేసి, శవాన్ని పడేశాడు. ఆ కేసు నమోదు కావడంతో అది పోలీసుల దృష్టికి రాలేదు.
ఆ సంఘటనతో రవీందర్ కుమార్‌కు ధైర్యం వచ్చినట్లు ఉంది. అతని నేరచరిత్ర పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత 2009లో ఓ కూలీ కుమారుడిని కిడ్నాప్ చేసి, అతనితో లైంగిక క్రీడ జరిపి గొంతు నులిమి చంపాడు. ఈసారి అతనిపై కేసు నమోదైంది. అయితే, సాక్ష్యాలు సరిగా లేకపోవడంతో చట్టం నుంచి తప్పించుకున్నాడు.
లైంగిక క్రీడకు నిరాకరించడం వల్ల, అంతు చూస్తామని బెదిరించడం వల్ల తాను 11 మంది బాధితులను చంపినట్లు కుమార్ చెప్పాడు. తాను సాయంత్రాల్లో గానీ ఉదయం పూట గానీ నేరాలు చేసేవాడినని రవీందర్ కుమార్ పోలీసులకు చెప్పాడు.

రవీందర్ కుమార్ తాను ఎలా ఆపరేషన్ చేశాననే విషయాన్ని కూడా పోలీసులకు వివరించాడు. అతను కాలనీల్లో తిరిగుతూ ఉండేవాడు. ఇళ్ల వెలుపల లేదా టాయిలెట్స్ వద్ద ఆడుకుంటున్న పిల్లలను స్వీట్లు, డబ్బులు ఆశపెట్టి తన వెంట తీసుకుని వెళ్లాడు. తనతో రావడానికి నిరాకరిస్తే బలవంతంగా ఎత్తుకుపోయేవాడు.
ఆంటీ ఇంటికి వచ్చినవారిపై కూడా..
2012లో తన ఆంటీ ఇంటికి వివాహ కార్యక్రమానికి వచ్చిన తన బంధువుకు చెందిన 14 ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలను కూడా అతను టార్గెట్ చేసుకున్నాడు. అయితే, విషయం ఎవరికీ చెప్పబోమని చెప్పడంతో వారిని చంపకుండా వదిలేశాడు.
ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీ కాంట్రాక్టర్ వద్ద క్లీనర్‌గా పనిచేస్తున్నప్పుడు 2013లో నోయిడాలో రెండు నేరాలు చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. దక్షిణ ఢిల్లీలోని బేగంపూర్‌లో ఓ బాలుడిపై దాడికి చేసిన కేసులో రవీందర్ కుమార్ పోలీసులకు చిక్కాడు. అతను బాలుడిని అడ్డుకుని, అతని గొంత నులిమి పారిపోయాడు. బాలుడు మరణించాడని రవీందర్ కుమార్ అనుకున్నాడు.
అయితే, సెప్టిక్ ట్యాంక్‌లో రక్తమోడుతూ కనిపించిన ఆ బాలుడిని పోలీసులు కాపాడారు. ఈ కేసులో కుమార్‌కు బెయిల్ లభించింది. అతను చేసిన దారుణమైన అఘాయిత్యాల గురించి పోలీసులకు అప్పటికి ఏమీ తెలియదు. దాంతో కుమార్ బెయిల్ పొందగలిగాడు.
రవీందర్ కుమార్ మరోసారి జులై 16వ తేదీన అరెస్టయ్యాడు. బేగంపూర్‌లో ఆరేళ్ల బాలికను రేప్ చేసి, హత్య చేసిన కేసులో అతను అరెస్టయ్యాడు. జులై 14వ తేదీన ఆ బాలిక కనిపించకుండా పోయింది. ఈ కేసులో పోలీసులు రవీందర్ కుమార్‌ను విచారిస్తున్నప్పుడు అతని నేరాల చిట్టా వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications