వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రూ.500, 2000 నోట్లకు ఎప్పుడు ఆమోదం లభించిందంటే..?

పెద్ద నోట్ల రద్దు అనంతరం చలామణిలోకి వచ్చిన కొత్త రూ. 500, 2000 నోట్ల డిజైన్‌పై భారత రిజర్వు బ్యాంక్ వివరణ ఇచ్చింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం చలామణిలోకి వచ్చిన కొత్త రూ. 500, 2000 నోట్ల డిజైన్‌పై భారత రిజర్వు బ్యాంక్ వివరణ ఇచ్చింది. సమాచారం హక్కు చట్టం ద్వారా జితేంద్ర ఘడ్డే అని వ్యక్తి ఈ మేరకు సమాచారం కోరగా.. గత సంవత్సరం మే నెలలోనే ఈ కొత్త నోట్లకు ఆమోదం తెలిపినట్లు ఆర్బీఐ తెలిపింది.

ఈ కొత్త నోట్ల డిజైన్‌ను గత మే 19న ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో అనుమతితోపాటు ఆమోదం లభించిందని ఆర్బీఐ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ డిజైన్ ను ఆమోదించిన ఆర్బీఐ గవర్నర్ పేరు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు.

RBI Central Board okayed design of Rs 500, Rs 2000 notes in May

పారదర్శకత చట్టంలోని 8(1)(ఎ) సెక్షన్ ప్రకారం ఈ వివరాలు ఇవ్వలేమని ఆయన తెలిపారు. డిజైన్ ఆమోదంపై ఖచ్చితమైన తేదీ కావాలంటూ జితేందర్ ఆర్బీఐ ద్వారా ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర బ్యాంక్ మొదటి సమావేశం, ఎజెండా, డిజైన్ ఆమోదం, ప్రింటింగ్ కొరకు ఆదేశాలు తదితర అంశాలపై ఖచ్చితమైన సమాచారం కావాలని ఆయన కోరారు.

English summary
The design of new banknotes of Rs 500 and Rs 2000 denominations was approved at the May 19, 2016 meeting of the Central Board of RBI, an RTI query has revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X