పెట్రోల్, డీజిల్ ధరల పెంపు భరించాల్సిందే- అమలు ముహూర్తం..!?

పెట్రో ఉత్పత్తుల పెంపు కు రంగం సిద్దం అయింది. ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పొదుపు చర్యలను ప్రధాని సూచించారు. ఇవి పరోక్షంగా ధరల పెంపు సంకేతాలుగా చర్చ జరిగాయి. ఇప్పుడు ప్రధాని తరువాత కీలక పదవుల్లో ఉన్న వారు ఒక్కొక్కొరుగా ఇవే సంకేతాలు ఇస్తున్నారు. అటు కేంద్ర కేబినెట్ భేటీ ఈ అంశాల పైన చర్చించి.. నిర్ణయం తీసుకునేందుకు ఈ రోజు సమావేశం అవుతోంది. కాగా.. ఆర్బీఐ గవర్నర్ సైతం ఈ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేసారు. పశ్చిమాసియాలో ఇదే విధంగా ఉద్రిక్త తలు కొనసాగితే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదని వ్యాఖ్యానించారు. యుద్దం కారణంగా చమురు సరఫరాకు ఇబ్బంది కలిగితే.. ఆ భారం వినియోగదారుల పైన పడుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కేంద్రం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని.. ఆయిల్ కంపెనీలు నష్టాలను భరిస్తున్నాయని వివరించారు. అయితే, ఎంత కాలం ఇలా నష్టాలు భరించగలుగుతాయని ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టమైన సంకేతాలుగా భావిస్తున్నారు. చమురు ధరలు పెరిగితే నిత్యావసరాల ధరల పైనా ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు పైన సంకేతాలు ఇస్తోంది. యుద్ధ వాతావరణం మరియు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద అంతరాయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును తాకింది.

 మిత్రపక్షాల దెబ్బకు విజయ్ 'యూ టర్న్', ఊహించని పరిణామాలు..!!
మిత్రపక్షాల దెబ్బకు విజయ్ 'యూ టర్న్', ఊహించని పరిణామాలు..!!
rbi-governor-sanjay-malhotra-signals-possible-petrol-diesel-price-rise-amid-middle-east-tensions

ధరల పెంపు పై స్పష్టమైన సంకేతాలు

దీనివల్ల దేశీయ చమురు సంస్థలు ప్రతిరోజూ సుమారు ₹1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నా యని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ధరలు పెరగవని తాను చెప్పడం లేదని, కానీ ధరల నిర్ణయానికి రాజకీయాలతో సంబంధం లేదని ఆయన పునరుద్ఘాటించారు. పరిస్థితులు విషమిస్తే భవిష్యత్తులో ధరల పెంపు తప్పకపోవచ్చనే సంకేతాలను ఆయన ఇచ్చారు. ఇదే సమయంలో దేశంలో ఇంధన కొరత లేదని మంత్రి భరోసా ఇచ్చారు. భారత్ వద్ద ప్రస్తుతం 60 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ మరియు సహజ వాయువు (LNG) నిల్వలు ఉన్నాయని, అలాగే 45 రోజులకు సరిపడా ఎల్పీజీ (LPG) నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 56,000 మెట్రిక్ టన్నులకు పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గించామని ఆయన పేర్కొన్నారు. 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' ద్వారా దేశ ఇంధన అవసరాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని పూరి వివరించారు. ప్రజలను ధరల పెంపు పైన వ్యూహాత్మకంగా సంసిద్దులను చేస్తున్నట్లు కనిపిస్తున్న వేళ.. ధరల పెంపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+