ఆర్బీఐ షాక్: జనధన్ ఖాతాలో రూ. 10 వేలు అంతే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: జనధన్ ఖాతాల్లో ఇకముందు నెలకు కేవలం రూ.10,000 మాత్రమే వితడ్రా చెయ్యాలని ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. అంతకు మించి నగదు వితడ్రా చేసుకోవడానికి వీలులేదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా జనధన్ ఖాతాల్లో రూ. 60,000 మించి నగదు ఉంటే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది ? అని పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించింది. సరైన సమాచారం ఇవ్వకుంటే తాము దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది.

RBI have other action of jan dhan accounts.

ఇటీవల ఆర్బీఐ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పుడు జనధన్ ఖాతాదారుల మీద ఆర్బీఐ దృష్టి సారించింది. ఇప్పటికే బ్లాక్ మనీ దాచుకున్న పెద్దలు తమకు బాగా తెలిసిన వారి జనధన్ ఖాతాల్లో నగదు డిపాజిట్ చేయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ జనధన్ ఖాతాల మీద దృష్టి సారించాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎవరైనా పరిచయం ఉన్న వారు డబ్బులు ఇస్తే ఆనగదును జనధన్ ఖాతాల్లో జమ చెయ్యరాదని హెచ్చరించిన విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
RBI have other action of jan dhan accounts. Restrict to Rs. 10,000 withdrawn per month and total of minimum strength in jandhan Rs. 60,000 abow Rs. 60,000 is questionable.
Please Wait while comments are loading...