త్వరలో కొత్త వంద నోట్లు వచ్చేస్తున్నాయ్..
నోటుపై గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటు.. వెనుక భాగంలో ముద్రణ సంవత్సరం 2017గా ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది.
ముంబై: త్వరలోనే కొత్త రూ.100నోటును మార్కెట్లోకి తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ మేరకు దానికి సంబంధించిన కసరత్తులు చేస్తోంది. కొత్తగా తీసుకొచ్చే వంద నోటులో.. అంకెల స్థానంలో 'ఆర్' అనే అక్షరాన్ని కూడా పొందుపరుస్తారు.

నోటుపై గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటు.. వెనుక భాగంలో ముద్రణ సంవత్సరం 2017గా ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. మహాత్మాగాంధీ సిరీస్-2005లో భాగంగా కొత్తగా తీసుకురాబోతున్న వంద నోట్లు.. గతంలో విడుదల చేసిన వంద నోట్లనే పోలి ఉంటాయని తెలిపింది. కొత్త వంద నోట్లతో పాటు పాత వంద నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది.












Click it and Unblock the Notifications