లగ్జరీ కార్లను కాదని "ఫార్చ్యూనర్"‌ లోనే మోడీ, పుతిన్‌ ఎందుకు వెళ్లారంటే..?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన వ్యవహారం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పుతిన్ నిన్న ( డిసెంబర్ 4, 2025 ) రాత్రి భారత్ చేరుకున్నారు. పుతిన్ పాలం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రోటోకాల్ ను పక్కన పెట్టి స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. ఈ తరహా హై-లెవల్ స్వాగతం భారత-రష్యా బంధానికి ప్రతీకగా భావిస్తున్నారు.

అయితే సాధారణంగా దేశ నాయకులు అత్యంత భద్రత కలిగిన ఆర్మర్డ్ రేంజ్‌రోవర్‌లు, బీఎండబ్ల్యూలు లేదా ప్రత్యేక భద్రతా వాహనాలు ఉపయోగిస్తారు. అయితే ఈసారి మోడీ తన రూటైన్ రేంజ్‌రోవర్‌లో కాకుండా టయోటా ఫార్చ్యూనర్ సిగ్మా 4 MT కారులో పుతిన్‌తో కలిసి ప్రయాణించడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఆసక్తిని రేపింది. అంతే కాకుండా రష్యా అధ్యక్షుడు తన ఆరస్ సెనేట్ లిమోసిన్‌ను ఉపయోగించకుండా ఈ సాధారణ వాహనంలో ప్రయాణించేందుకు అంగీకరించడం గమనార్హం.

reasons-behind-vladimir-putin-and-pm-modi-travelling-in-fortuner-car

పుతిన్, మోడీ ఒకే కారులో ప్రయాణించడం మూడు నెలల్లో ఇది రెండోసారి. చైనాలోని తియాంజిన్‌ సిటీలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించిన విషయం తెలిసిందే. కాగా పుతిన్, మోడీ - ఇద్దరూ అత్యంత భద్రత అవసరమయ్యే ప్రపంచ నాయకులు. ఇలాంటి వారు సాదాసీదా SUVలో ప్రయాణించడం అరుదైన విషయం. దీంతో అసలు ఈ కారులోనే ఎందుకు కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చిందని జోరుగా చర్చ నడుస్తోంది.

ఇక ఈ ఫార్చ్యూనర్ (MH01EN5795) 2024 ఏప్రిల్‌లో రిజిస్టర్ అయ్యింది. ఇది BS-6 నార్మ్స్‌కి అనుగుణంగా ఉండి 2039 వరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కలిగి ఉంది. అయితే ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్ కు చెందిన టయోటాను ఎంచుకుని మోడీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

reasons-behind-vladimir-putin-and-pm-modi-travelling-in-fortuner-car

ఈరోజు ( డిసెంబర్ 5, 2025 ) పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌ చేరుకున్నారు. ఆయనకు భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలికాయి. అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి, మహాత్మాగాం«దీకి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ హౌస్‌లో జరిగే 23వ ఇండియా-రష్యా సదస్సులో పాల్గొంటారు. ఇదే భవనంలో పుతిన్‌కు, ఆయన ప్రతినిధి బృందానికి మోడీ విందు ఇవ్వనున్నారు.

ఇక సదస్సు తర్వాత ఇద్దరు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం. అలాగే రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూ ఇండియా చానల్‌ను పుతిన్‌ ప్రారంభిస్తారు. అంతే కాకుండా పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి 9 గంటల సమయంలో పుతిన్‌ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+