సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం: బాలుడి ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం.. రవికుమార్ అనే బాధిత బాలుడు ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి దిలీప్ కుమార్ టేలర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. కాగా, రవికుమార్ గత మూడు రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు. ఎందుకు వెళ్లడం లేదని అడిగితే క్లాసులు జరగడం లేదని చెబుతున్నాడు.
అయితే పాఠశాల తరగతులు కొనసాగుతున్నాయనే వాస్తవాన్ని దిలీప్ కుమార్ తెలుసుకున్నాడు. దీంతో తన కొడుకును గురువారం ఉదయమే నిద్రలేపి పాఠశాలకు వెళ్లాలని బలవంతపెట్టాడు దిలీప్. వెంటనే కిచెన్ లోకి వెళ్లిన రవికుమార్ బెల్టుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, బాధిత బాలుడు తన తోటి విద్యార్థులకు సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఉన్నందున తనకూ కావాలని అతని తండ్రిని గత కొన్ని రోజులుగా కోరుతున్నాడు. దిలీప్ అందుకు అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్న రవికుమార్ పాఠశాలకు వెళ్లడం మానేశాడు. మళ్లీ పాఠశాలకు వెళ్లమనడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications