క్వాటర్స్ లో మాకం వేసిన ఉగ్రవాదులు (ఫోటోలు)

పఠాన్ కోట్: పంజాబ్ లోని పాఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోని సిబ్బంది క్వాటర్స్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని అంతం చెయ్యడానికి ఆపరేషన్ కొనసాగుతుందని సీనియర్ అధికారులు తెలిపారు.

ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఎస్ జీ దళాలకు చెందిన సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో మకాం వేశారు. ఎన్ఎస్ జీకి చెందిన మేజర్ జనరల్ దుష్యంత్ సింగ్ సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు.

ఇప్పటి వరకు ఐదుగురు ఉగ్రవాదులను అంతం చేశామని వివరించారు. ఉగ్రవాదులు భారీ ఆయుధ సంపత్తితో వచ్చారని అన్నారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చాల పెద్దదని, దాదాపు ఓ నగరం అంత వైశాల్యం ఉంటుందని అధికారులు వివరించారు.

స్కూల్స్, క్వాటర్స్

స్కూల్స్, క్వాటర్స్

ఎయిర్ బేస్ క్యాంపస్ లో అత్యాధునిక ఆయుధాలతో పాటు స్కూళ్లు, సిబ్బంది నివాసాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.

ఆస్తులకు నష్టం జరగకుండా

ఆస్తులకు నష్టం జరగకుండా

ఎయిర్ బేస్ లో ఆస్తులకు గానీ, ఆయుధాలకు గానీ ఎలాంటి ముప్పులేదని అధికారులు స్పష్టం చేశారు.

రంగంలోకి దిగారు

రంగంలోకి దిగారు

ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఎస్ జీ, పంజాబ్ పోలీస్ కలిసి ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి పని చేస్తున్నాయని అన్నారు.

ఆపరేషన్ కొనసాగుతుంది

ఆపరేషన్ కొనసాగుతుంది

ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని, అది పూర్తి అయితే కాని పూర్తి వివరాలు చెప్పలేమని అధికారులు అన్నారు.

జనవరి 1 నుంచి అలర్ట్

జనవరి 1 నుంచి అలర్ట్

జనవరి ఒకటవ తేది నుంచి తాము అప్రమత్తంగానే ఉన్నామని అధికారులు అన్నారు.

నిఘా వర్గాల హెచ్చరిక

నిఘా వర్గాల హెచ్చరిక

నిఘా వర్గాల హెచ్చరికతో ఆర్మీ కూడా ఎయిర్ బేస్ పరిసర ప్రాంతాల్లో 8 దళాలను మోహరించిందని ఇదే సందర్బంలో అధికారులు గుర్తు చేశారు.

గరుడ్ దళంతో తలపడ్డారు

గరుడ్ దళంతో తలపడ్డారు

ఉగ్రవాదులు మొదట గరుడ్ దళంతో తలపడ్డారని, తరువాత ఎన్ఎస్ జీ, ఆర్మీ, గరుడ్ దళాల సంయుక్త దాడులతో ఉగ్రవాదులు కొంత ఏరియాకే పరిమితం అయ్యారని వివరించారు.

రెండు అంతస్తుల భవనంలో

రెండు అంతస్తుల భవనంలో

ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నివాసం ఉండే రెండు అంతస్తుల భవనంలో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకుని ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఖాళీ చేయిస్తున్నారు

ఖాళీ చేయిస్తున్నారు

సిబ్బంది కుటుంబ సభ్యులను అక్కడి నుంచి సురక్షింతంగా ఖాళీ చేయిస్తున్నామని అధికారులు చెప్పారు.

మెరుగైన చికిత్స

మెరుగైన చికిత్స

క్షతగాత్రులకు కమాండో ఆసుపత్రిలో, పఠాన్ కోట్ లోని ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని అందరూ కోలుకుంటున్నారని అన్నారు.

ఆస్తులు క్షేమం

ఆస్తులు క్షేమం

ఎయిర్ బేస్ లోని ఆస్తులు ధ్వంసం చెయ్యడానికి ఉగ్రవాదులు ప్లాన్ వేశారని, అయితే ఆస్తులు అన్ని సురక్షితంగా ఉన్నాయని తాము హామి ఇస్తున్నామని అధికారులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+