వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్లుండే రిలయన్స్ వార్షిక సమావేశం, కీలక ప్రకటన?

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వార్షిక సాధారణ సమావేశం శుక్రవారం నాడు నిర్వహించనుంది. ఈ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సూపర్ స్పీడ్‌లో

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వార్షిక సాధారణ సమావేశం శుక్రవారం నాడు నిర్వహించనుంది. ఈ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సూపర్ స్పీడ్‌లో అత్యధిక డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం వంటి ఆఫర్లతో జియో మార్కెట్ ను కుదిపేసింది.

శుక్రవారంనాడు నిర్వహించే ఈ సమావేశంలో రియలన్స్ అధినేత ఏ రకమైన సంచలన ప్రకటన చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది. అత్యంత తక్కువధరకే 4జీ ఫీచర్ ఫోన్‌ను రిలయన్స్ ప్రారంభించనుందని సమాచారం.

Reliance Jio users be ready! Cheap 4G phone, JioFiber, more data expected at Reliance AGM

జియో ఫీచర్ ఫోన్‌పై ఇప్పటికే పలు ఆసక్తికర రిపోర్టులు వస్తున్నాయి. ఈ ఫోన్ రూ.500 మార్కెట్‌లోకి తీసుకురానున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఫోన్‌తో మొబైల్ సెక్టార్‌లో కూడ ముఖేష్ అంబానీ సంచలనాలు సృష్టించబోతున్నారని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. రిలయన్స్ కంపెనీ ఇంటెక్స్ మధ్య సంప్రదింపులు జరిగాయని ప్రచారం సాగుతోంది. అందుకే అతి తక్కువ ధరకే ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రిలయన్స్ ప్రయత్నించినట్టు సమాచారం.

ఫీచర్ ఫోన్‌తో బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ జియో ఫైబర్‌ను రిలయన్స్ ఆవిష్కరించనుందని ప్రచారం. ఈ ప్రకటన కూడ బ్రాడ్‌బ్యాండ్ ఇండస్ట్రీని షేక్ చేయనుందని సమాచారం. ఈ ఏడాది తొలినాళ్ళలోనే ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, అహ్మదాబాద్, జమ్మూనగర్, సూరత్, వడోదర వంటి ప్రాంతాల్లో జియో ఫైబర్ ప్రీవ్యూ ఆఫర్‌ను తెచ్చింది. దేశవ్యాప్తంగా తీసుకువస్తున్న ఈ సేవలపై ఉచితంగానే మూడు మాసాలపాటు ప్రతినెలా 100 ఎంబిపీఎస్ స్పీడ్‌తో 100జీబీ డేటాను జియో తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది.

అయితే దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి తొలుత 4500 రూపాయాలు కట్టాలి. ఈ మొత్తాన్ని కూడ తర్వాత రీఫండ్ చేయనున్నారు. అంతకుముందే క్లారిటీ ఇచ్చేసింది. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ధరలు కూడ రూ. 500 నుండి ప్రారంభంకానున్నాయని తెలిసింది. రూ. 500 600జీబీ డేటా, రూ.2వేలకు 1000 జీబీ డేటాను 100 ఎంబిపీఎస్ స్పీడ్‌లో జియో ఆఫర్ చేస్తోంది.

English summary
Reliance Jio has been drawing eyeballs since its launch in September and is most likely not going to break tradition when Reliance Industries holds its Annual General Meeting (AGM) on Friday. Reliance Industries Chairman Mukesh Ambani is expected to make some crucial announcements revolving around telecom disruptor Reliance Jio which may include higher speeds and cheaper devices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X