Varavara Rao : వరవరరావుకు ఊరట-మెడికల్ బెయిల్ 24వరకూ పొడిగించిన బోంబే హైకోర్టు
విరసం నేత వరవరరావుకు బోంబే హైకోర్టులో ఇవాళ ఊరట లభించింది. భీమా కౌరెగావ్ కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్ పై ఉన్న వరవరరావుకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. తదుపరి విచారణ వరకూ ఆయన బెయిల్ పొడిగించింది. దీంతో ఆయన ఈ నెల 24 వరకూ బెయిల్ పై ఉండబోతున్నారు.
బీమా కొరెగావ్ కేసులో అరెస్టైన వరవరరావును మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉంచారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఏడాది మార్చిలో ఆయన బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనకు బోంబే హైకోర్టు మధ్యంతర మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువు నిన్నటితో ముగిసింది. దీంతో తన బెయిల్ పొడిగించాలని వరవరరావు హైకోర్టును కోరారు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 24 వరకు మాత్రమే బెయిల్ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

మరోవైపు ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏ భీమా కొరెగావ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. తాజాగా ఈ కేసులో ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో తలోజా జైలు అధికారులు వరవరరావుకు కాటరాక్ట్ సర్జరీతో పాటు హెర్నియా ఆపరేషన్ చేసేందుకు వీలుందని, కాబట్టి మెడికల్ బెయిల్ పొడిగించవద్దంటూ కోర్టును కోరింది.
అయితే కోర్టు మాత్రం వరవరరావుకు బెయిల్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాను రోజూ 13 రకాల మందులు వాడుతున్నానంటూ వరవరరావు సమర్పించిన ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని బెయిల్ పొడిగించింది. దీంతో ఆయనకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. మరోవైపు ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న స్టాన్ స్వామి మరణం నేపథ్యంలో వచ్చిన విమర్శలతో బీమా కొరెగావ్ కేసులోనూ వరవరరావు సహా ఇతర నిందితుల విషయంలో హైకోర్టు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఎన్ఐఏ మాత్రం కోర్టు నిర్ణయాల్ని వ్యతిరేకిస్తోంది.












Click it and Unblock the Notifications