• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిగ్ న్యూస్: కొవిడ్ రోగులకు ఊరట -రెమ్‌డెసివిర్ ధర భారీ తగ్గింపు -ఒక ఇంజెక్షన్ ఇప్పుడు రూ.899

|

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయిని దాటడం, కొత్త కేసులు, మరణాలు భారీగా పెరగడం, ఆస్పత్రులు నిండిపోవడంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో బెడ్ల కొరత ఏర్పటం, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కొరత ఉందంటూ వివిధ రాష్ట్రాలు కేంద్రానికి మొరపెట్టుకుంటుండటం, అంతలోనే పిడుగుపాటులాగా వ్యాక్సిన్ల కరత అంశం తెరపైకి రావడం, టీకా ఉత్పత్తి దిగ్గజాలైన సీరం లాంటి సంస్థలూ దాదాపు చేతులెత్తేయడంతో దేశప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. దీంతో కొవిడ్ వ్యాక్సిన్ కు ప్రత్యామ్నాయంగా వాడుతోన్న రెమ్‌డెసివిర్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. సదరు ఇంజెక్షన్లను ఆస్పత్రుల నుంచి దొగతనం చేసే దుస్థితి తలెత్తిది. ఈ నేపథ్యంలో..

జగన్‌పై అమిత్ షా యాక్షన్ -విదేశీ పర్యటనలు రద్దు -పవన్ చెప్పింది చేస్తా -తిరుపతిలో రీపోల్: ఎంపీ రఘురామజగన్‌పై అమిత్ షా యాక్షన్ -విదేశీ పర్యటనలు రద్దు -పవన్ చెప్పింది చేస్తా -తిరుపతిలో రీపోల్: ఎంపీ రఘురామ

కొవిడ్ రోగులకు బిగ్ రిలీఫ్

కొవిడ్ రోగులకు బిగ్ రిలీఫ్


కరోనా రెండో దశ ప్రళయం కొనసాగుతుండగా, కోవిడ్-19 రోగులకు గొప్ప ఊరటనిచ్చే వార్తను కేంద్రం వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్ కు ప్రత్యామ్నాయంగా వాడుతోన్న యాంటీ ఎబోలా వ్యాక్సిన్ ‘‘రెమ్‌డెసివిర్'' ఇంజెక్షన్ ధరను భారీగా తగ్గించారు. ఇప్పటిదాకా రెండెసివీర్ ఒక ఇంజెక్షన్ ధర దాదాపు మూడు వేలు ఉండగా, ఒక్కొక్క ఇంజెక్షన్‌కు సుమారు రూ.2,000 చొప్పున తగ్గించించారు. దీంతో ఒక ఇంజెక్షన్ కనీస ధర ఇప్పుడు రూ.899కే అందుబాటులోకి రానుంది. అయితే, ఆయా కంపెనీని బట్టి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ధరలు వేర్వేరుగా ఉంటాయి.

శవ రాజకీయం -మోదీ సంచలనం -టీఎంసీ తుక్కురేగింది -దీదీనే అడ్డుగోడ -మమత ఆడియో లీక్శవ రాజకీయం -మోదీ సంచలనం -టీఎంసీ తుక్కురేగింది -దీదీనే అడ్డుగోడ -మమత ఆడియో లీక్

ఫార్మా సంస్థలతో కేంద్రం చర్చలు..

ఫార్మా సంస్థలతో కేంద్రం చర్చలు..

వ్యాక్సిన్లు తయారు చేయడానికి అవసరమైన ముడి సరుకు సరఫరాను అమెరికా నిలిపేయడంతో భారత్ లో టీకాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది. నిషేధాన్ని ఎత్తేయాలంటూ సీరం లాంటి సంస్థలు నేరుగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ను వేడుకుంటున్నాయి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ల కొరత లేదని వాదిస్తోన్న కేంద్రం.. ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిసారించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్ ఔషధాన్ని తయారు చేసే మాన్యుఫ్యాక్చరర్లతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలో ఇంజక్షన్ల ధరలు భారీగా తగ్గాయి. రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్ డిపార్ట్‌మెంట్ సభ్య సలహాదారు డాక్టర్ వినోద్ కొత్వాల్ ఈ మేరకు శనివారం ఓ జాబితా విడుదల చేశారు.

సవరించిన ధరల జాబితా ఇదే..

సవరించిన ధరల జాబితా ఇదే..

రెమ్‌డెసివిర్ ధర తగ్గింపునకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఆ డ్రగ్ ను వివిధ ఫార్మా కంపెనీలు ఎంత మేరకు తగ్గించాయో స్పష్టంగా పేర్కొన్నారు. రెమ్‌డెసివిర్ ఔషధాన్ని వివిధ ఫార్మా సంస్థ వేర్వేరు ధరల్లో అమ్ముతున్నాయి. కేంద్రం అభ్యర్థ తర్వాత ఆయా కంపెనీలు సవరించిన ధరలు ఇలా ఉన్నాయి..
1క్యాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ రెమ్‌డాక్ రూ.2,800 నుంచి రూ.899కి తగ్గింది. ఇకపై రూ.899కి లభిస్తుంది.
2. సింజెన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బయోకాన్ బయాలజిక్స్ ఇండియా) రెమ్‌విన్ రూ.3,950 నుంచి 2,450కి తగ్గింది.
3. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ రెడిక్స్ రూ.5,400 నుంచి రూ.2,700కు తగ్గింది.
4. సిప్లా లిమిటెడ్ సిప్రెమి రూ.4,000 నుంచి రూ.3,000కు తగ్గింది.
5. మైలాన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెస్రెమ్ రూ.4,800 నుంచి రూ.3,400కు తగ్గింది.
6. జుబిలెంట్ జనరిక్స్ లిమిటెడ్ జుబి-ఆర్ రూ.4,700 నుంచి రూ.3,400కు తగ్గింది.
7. హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్ కోవిఫోర్ రూ.5,400 నుంచి రూ.3,490కి తగ్గింది.

English summary
Pharmaceutical companies manufacturing the anti-COVID medicine Remdesivir in India have voluntarily slashed prices following government intervention, National Pharmaceutical Pricing Authority (NPPA) under the Department of Pharmaceuticals announced on Saturday. The authority declared change in prices for seven brands of Remdesivir injections of potency 100mg per vial. According to an office memoradum by NPPA dated April 17, 2021, the prices have been slashed in the range of Rs 1,000 to Rs 2,700. After the price cuts, Cadila Healthcare's Remdac continues to be the cheapest Remdesivir injection at Rs 899. The injection was earlier being sold at Rs 2,800.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X