రాజీవ్ గాంధీ కరెప్షన్ నంబర్ 1 అన్న మోడీ ...తప్పు పట్టిన బీజేపీ సీనియర్ నేత

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి హోరా హోరీగా పోరు జరుగుతుంది. మాటల యుద్ధాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ. ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా , సోనియా గాంధీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తన జీవితాన్ని నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. . మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దేశ ప్రధానిగా సమున్నత స్థానంలో పని చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపాటుకు గురయ్యింది.

రాజీవ్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలని కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస ప్రసాద్ ఖండించారు. రాజీవ్ గాంధీ కరెప్షన్ కారణంగా చనిపోలేదని, శ్రీలంకకు చెందిన ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దాడిలో ఆయన చనిపోయారని పేర్కొన్నారు. మోడీ చెప్పిన విషయం ఎవరూ నమ్మరని ఆయన అన్నారు.

Respect PM But Not His Remarks on Rajiv Gandhi.. BJP Leader Reacts on Modis Corrupt No.1 Jibe

ఇక బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస ప్రసాద్ ఈ విషయంపై స్పందిస్తూ ''రాజీవ్ గాంధీని ఎల్‌టీటీఈ చంపేసింది. అవినీతి ఆరోపణలతో ఆయన చనిపోలేదు. ఇటువంటి ఆరోపణలను ఎవరూ విశ్వసించరు. చివరికి నేను కూడా నమ్మను. మోదీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అయితే, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు'' అని బీజేపీనేత శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు.రాజకీయ ఉద్దండుడైన వాజ్‌పేయి లాంటి వారే రాజీవ్‌ గురించి గొప్పగా చెప్పారని ప్రసాద్ గుర్తు చేశారు. రాజీవ్ చాలా చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారంటూ కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+