చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Restaurant: రెస్టారెంట్ లో ఓనర్ ను నరికేశారు. సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్, మ్యాటర్ ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తుత్తుకుడి: గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, యువత చెడిపోతున్నదని, అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. గంజాయి విక్రయిన్న వారు ఆయన ఆస్తులను ఇప్పటికే తగలబెట్టారు. అయితే సామాజిక కార్యకర్తను ఓ రెస్టారెంట్ లో వేటకొడవళ్లతో నరకడం కలకలం రేపింది. న్యూఇయర్ వేడుకల ముందే గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయి మాకు వ్యతిరేకంగా ఎవరైన నోరు విప్పితే ఇలాగే ఉంటుందని హెచ్చరించడం కలకలం రేపింది.

Wife: పెళ్లైన మూడు రోజులకే బెడ్ రూమ్ లో భార్య తల్లితో రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టిక్ టాక్ స్టార్Wife: పెళ్లైన మూడు రోజులకే బెడ్ రూమ్ లో భార్య తల్లితో రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టిక్ టాక్ స్టార్

 గంజాయి ముఠా

గంజాయి ముఠా

తమిళనాడులోని తుత్తకుడి జిల్లాలోని ఆరుముకనేరి సమీపంలోని కాయల్‌పట్నం ప్రాంతాల్లో గంజాయితో పాటు మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టాలని, అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది ఆరుముకనేరి బజార్‌లో రోడ్డును ఇరు వైపుల మూసేసిన స్థానికులు ధర్నా నిర్వహించడం కలకలం రేపింది.

 సమాజ సేవకుడు, రెస్టారెంట్ యజమాని

సమాజ సేవకుడు, రెస్టారెంట్ యజమాని

ఆదవ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ యజమాని బాలకుమారేశన్ ఆధ్వర్యంలో ఆరోజు రోడ్డు మీద పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. బాలకుమారేశన్ ప్రముఖ రెస్టారెంట్ యజమాని. ఈ నిరసన నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ఓ ముఠా బాలకుమారేశన్ నిర్వహిస్తున్న డెయిరీకి నిప్పు పెట్టారు. ఈ కేసులో పోలీసులు చర్యలు చేపట్టి కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 రెస్టారెంట్ లో దాడి

రెస్టారెంట్ లో దాడి


ఈ సందర్భంలో శుక్రవారం రాత్రి బాలకుమారేశన్ నడుపుతున్న రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన ఓ ముఠా సభ్యులు అతన్ని చంపాలనే ఉద్దేశ్యంతో కత్తులు, మారణాయుధాలతో నరికేశారు. వెంటనే బాలమురగేశన్ ను ఆసుపత్రికి తరలించారు బాలకుమరేశన్ కు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు.

 ఐపీయూలో చికిత్స

ఐపీయూలో చికిత్స

బాలకుమరేశన్ తుత్తకూడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఆరుముగనేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలకుమారేశన్‌ను ఓ గ్యాంగ్ మారణాయుధాలతో నరికిన సమయంలో ఆయన రెస్టారెంట్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ ఇప్పుడు విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూఇయర్ వేడుకల ముందే గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయి మాకు వ్యతిరేకంగా ఎవరైన నోరు విప్పితే ఇలాగే ఉంటుందని హెచ్చరించడం కలకలం రేపింది.

English summary
Restaurant owner attacked with knives for complaining about ganja gang in Tamil Nadu, CCTV footage goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X