సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ జీటీ నానావతి కన్నుమూత: గోద్రా, సిక్కు వ్యతిరేక అల్లర్లపై విచారణ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గిరీష్ థకోరల్(జీటీ) నానావతి (86) శనివారం మధ్యాహుం 1.15 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002లో జరిగిన గుజరాత్ మత ఘర్షణల కేసులను ఆయన విచారించారు.
ఫిబ్రవరి 17, 1935న జన్మించిన గిరీష్ నానావతి ఫిబ్రవరి 11, 1958న బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తొలుత బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన నానావతి.. 1979లో గుజరాత్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
తర్వాత 1994లో ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 1995 మార్చిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన నానావతి 2000 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు.

కాగా, 2002 గోద్రాఅల్లర్లపై విచారణ జరిపిన జస్టిస్ నానావతి, అక్షరు మెహతాలు 2014లో తమ తుది నివేదికను అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్‌కు అందచేశారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపైనా ఆయన విచారించారు.
గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు రెండు కోచ్‌లను దగ్ధం చేసి 59 మంది కరసేవకులను సజీవ దహనం చేశారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేయడానికి 2002లో నరేంద్ర మోడీ ఈ కమిషన్‌ను నియమించారు. గోద్రాహింసాకాండలో దాదాపు రెండు వేల మంది పైగా చనిపోయారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications