హరియాణలో హింసకు ఎవరు కారణం, మోను మనేసర్ ఎవరంటే ?, సీఎం ఎంట్రీ !
గురుగ్రామ్/ హరియానా: రెండు వర్గాల మధ్య గొడవలు మొదలు కావడంతో అమాయకులు బలి అయ్యారు. హరియాణలోని నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య గొడవలు జరగడంతో ఆ హింస గురుగ్రామ్ కు వ్యాపించింది. రెండు రోజుల క్రితం భజరంగ్ ధళ్ నాయకుడు మోను మనేసర్ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో హరియాణలో మత ఘర్షణలకు కారణం అయ్యిందని ఆరోపణలు ఉన్నాయి.
ఇదే ఏడాది ఫిబ్రవరిలో హరియాణలో ఇద్దరు ముస్లీం వ్యక్తులు హత్యకు గురైనారు. నూహ్ జిల్లాలో జరిగిన ఓ వర్గంలోని ర్యాలీలో భజరంగ్ దళ్ నాయకుడు మోను మనేసర్ హాజరు అయ్యారని పుకార్లు వ్యాపించడంతో రెండు వర్గాల మధ్య గొడవలు మొదలైనాయి. ఈ గొడవల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోమ్ కార్డులతో పాటు నలుగు చనిపోయారు.

నూహ్ జిల్లాలో జరిగిన గొడవల్లో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాత్రి నూహ్ జిల్లా నుంచి ఈ గొడవలు గురుగ్రామ్ కు వ్యాపించాయి. రాత్రిపూట మసీదును తగలబెట్టడానికి కొందరు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హరియాణలో హింసను అనిచివేస్తామని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ప్రజలకు మనవి చేశారు.
నూహ్ జిల్లాలో మంగళవారం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోందని హరియాణ హోమ్ మంత్రి అనిల్ విజయ్ తెలిపారు. నూహ్ లో జరిగే మతపరమైన ఊరేగింపుకు తాను హాజరు అవుతానని, తన మద్దతుదారులతో పాటు మన వర్గం వారు అందరూ హాజరు కావాలని. అయితే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అంటూ భజరంగ్ దళ్ నాయకుడు మోను మనేసర్ రెండు రోజుల క్రితం ఓ వీడియో పోస్టు చేశారు.
విశ్వహిందు పరిషత్ సలహా మేరకు తాను ఈ సమావేశంలో పాల్గొనడం లేదని, తాను వ్యక్తిగతంతో ఈ సమావేశానికి హాజరు అవుతున్నానని మోను మనేసర్ చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. గత ఫిబ్రవరి నెలలో భివానీలో కాలిపోయిన కారులో పశువుల వ్యాపారులు జువైద్, నసీర్ శవాలైనారు. ఆ సంఘటన అప్పట్లో హరియాణలో కలకలం రేపింది.

2019లో గోవులను తరలిస్తున్న పశువుల స్మగ్లర్ల మీద కాల్పులు జరపడంతో మోను మనేసర్ పాపులర్ అయ్యాడు. 2015లో గోహత్య నిషేధచట్టం అమలులోకి వచ్చిన తరువాత హరియాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోసంరక్ష్ జిల్లా కమిటీల్లో మోను మనేసర్ చురుగా పాల్గొన్నాడు. ఇప్పుడు నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య గొడవలు జరగడానికి మోను మనేసర్ కారణం అని మరో వర్గం వాళ్లు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications