కేరళలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి..
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని అలప్పుజలో ఆర్‌టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
కర్నాటక రాష్ట్ర రోడ్డు బస్సును ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటన నిన్న( సోమవారం) రాత్రి కలర్‌కోడు వద్ద జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అలప్పుజాలోని టిడి మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షం మధ్య రాత్రి 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదానికి ముందు గంటసేపు అతి భారీ వర్షం కురిసినట్లు స్థానికులకు చెబుతున్నారు.

బస్సు అతివేగంగా వచ్చి, కారును ఢీకొన్నదని ఇక్కడివారు అంటున్నారు. మృతిచెందిన వారిలో వందనం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ముహ్సిన్, మహమ్మద్, ఇబ్రహీం, దేవన్‌లుగా గుర్తించారు. ఈ సంఘటనలో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఇక, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను వందనం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు..
వివరాల మేరకు.. చనిపోయినవారు కోజికోడ్, కన్నూర్, చేర్యాల, లక్షద్వీప్‌కు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కర్నాటక రాష్ట్ర రోడ్డు బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications