కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఎంపీతో పాటు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు
కుంభమేళా వెళ్లి వస్తుండగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా ప్రమాదానికి గురయ్యారు. కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఈరోజు తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తూ.. ఎంపీ మహువా కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. ఆమె కుమారుడు, కోడలితో కలిసి కారులో తిరిగి వస్తుండగా.. ఝార్ఖండ్‌లోని లతేహార్ సమీపంలో ఆగి ఉన్న ఓ ట్రక్కును వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీతో పాటు పాటు కుటుంబ సభ్యులకు సైతం గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎంపీ చేతికి ఫ్రాక్చర్ అయిందని.. మెరుగైన చికిత్స కోసం రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications