బ్యాంకు లూటీకి యత్నం: ఏటీఎంలో రూ. 2 లక్షలు లూటీ

బెంగళూరు: బ్యాంకులోకి చొరబడి నగదు లూటీ చెయ్యడానికి విఫలయత్నం చేసిన సంఘటన మైసూరు సమీపంలోని పిరియపట్టణలో జరిగింది. అయితే కట్టడంలో లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన నిందితులు వీలు కాకపోవడంతో అదే కట్టడంలోని ఏటీఎంలో నగదు లూటీ చేశారు.

పిరియపట్టణలోని పంచవళ్ళి ప్రాంతంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఉంది. సోమవారం సాయంత్రం బ్యాంకు సిబ్బంది విధులు ముగించుకుని ఇంటికి వెళ్లారు. అర్దరాత్రి దాటిన తరువాత దుండగులు బ్యాంకులోకి చొరబడటానికి విఫలయత్నం చేశారు.

కిటికీలు పగలగొట్టి స్ట్రాంగ్ రూంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో అదే కట్టడంలోని ఇండియన్ ఓవర్సీస్ ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు. అత్యాధునికమైన పరికరాలు ఉపయోగించి ఏటీఎం యంత్రం పగలగొట్టారు. తరువాత యంత్రం విడిగా చేశారు.

robbed Indian overseas bank ATM

అందులో ఉన్న నగదు మొత్తం లూటీ చేసి మాయం అయ్యారు. మంగళవారం ఉదయం ఏటీఎంలో నగదు డ్రా చేసుకొవడానికి వెళ్లిన ఖాతాదారులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఏటీఎంలో రూ. రెండు లక్షలు చోరీ అయ్యిందని బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారని పోలీసులు అన్నారు. ముగ్గురు దుండగులు ముసుగులు వేసుకుని ఏటీఎం యంత్రం పగలగొట్టి నగదు లూటీ చేసిన దృశ్యాలు అక్కడ ఎర్పాటు చేసిన సీసీకెమెరాలలో రికార్డు అయ్యాయని, ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటిగార్డులు లేరని కేసు దర్యాప్తులో ఉందని పిరియపట్టణ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+