రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని అరెస్ట్ చేసిన సీబీఐ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ తపస్ పాల్ ను సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది.

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ తపస్ పాల్ ను సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ఆయన్ను దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించిన తర్వాత సీబీఐ అధికారులు ఈ చర్య తీసుకున్నారు.

రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసు విచారణలో సీబీఐ సంధించిన ప్రశ్నలకు ఎంపీ తపస్ పాల్ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడం వల్లే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు సీబీఐ పేర్కొంది.

Rose Valley Chit Fund Scam : TMC MP Arrested by CBI

తపస్ పాల్ గతంలో ఈ రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కంపెనీకి డైరెక్టర్ గా పనిచేశారు. రూ.17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మంది మడుపర్లను ఈ కంపెనీ మోసగించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కంపెనీ ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ లబ్ది పొందినట్లు అనుమానం.

ఆ పార్టీకే చెందిన మరో నేత సుదీప్ బందోపాధ్యాయకు కూడా ఈ కేసులో సమన్లు జారీ అయ్యాయి. ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+