వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2 వేల నోటు: ఆసక్తికర అంశం తెలిపిన కేంద్రం.. ఏంటంటే..

|
Google Oneindia TeluguNews

రూ.2వేల నోటుపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోటు ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదనే అంశంపై స్పష్టత ఇచ్చింది. 2 వేల నోటు ముద్రణ ఎందుకు తగ్గించారు.. ఎన్ని నోట్లు చెలామణిలో ఉన్నాయనే ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. గ‌త రెండేళ్లుగా రూ.2వేల నోటును ముద్రించ‌డం లేద‌ని లోక్‌స‌భ‌లో వెల్ల‌డించింది. ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో ఈ విష‌యం తెలియజేశారు.

Cheating: బ్యాంక్ లో బ్యాడ్ టైమ్, అంకుల్, కిలాడీ రొమాన్స్,పెళ్లి, నాకించేసి రూ. కోట్లు స్వాహా ! Cheating: బ్యాంక్ లో బ్యాడ్ టైమ్, అంకుల్, కిలాడీ రొమాన్స్,పెళ్లి, నాకించేసి రూ. కోట్లు స్వాహా !

2018, మార్చి 30 నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయ‌ని ఠాకూర్ చెప్పారు. 2021, ఫిబ్ర‌వ‌రి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్ల‌కు త‌గ్గింద‌న్నారు. ప్రజల ఆర్థిక లావాదేవీల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐతో సంప్రదించి నోట్ల ముద్రణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనురాగ్ ఠాకూర్ వివరించారు.

rs 2000 notes not printed in last 2 years

2019-20, 2020-21ల‌ రూ.2000 నోటు ముద్రించ‌ లేదని తెలిపారు. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో మొత్తం 354.2 కోట్ల రూ.2000 నోట్ల‌ను ముద్రించిన‌ట్లు 2019లో ఆర్బీఐ తెలిపింది. అధిక విలువ క‌లిగిన నోట్ల ముద్ర‌ణ‌ను త‌గ్గించి, తద్వారా బ్లాక్ మనీ అడ్డుక‌ట్ట వేసే ఉద్దేశంతోనే వీటి ముద్ర‌ణ‌ను నిలిపివేసిన‌ట్లు తెలుస్తోంది. 2016లో నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌భుత్వం తొలిసారి రూ.2000 నోటును తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

English summary
rs 2000 notes not printed in last 2 years central government told to loksabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X