వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.500, 1000నోట్ల మార్పిడి: మీ26 ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇవే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని పూర్తి రూపుమాపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూ. 500, 1000 నోట్లను పూర్తిగా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో అనేకమందిలో చాలా ప్రశ్నలు మెదలుతున్నాయి. అసలు ఈ నిర్ణయం వల్ల ఎవరికి ప్రయోజనం, ఏమైనా ఫలితం ఉంటుందా? అనే సందేహాలున్నాయి. అలాంటి వాటిలో కొన్ని ప్రశ్నలు తీసుకున్నట్లయితే..

1. ఈ పథకం ఎందుకు?

మన దేశంలో ఇటీవల కాలంలో ఫేక్ కరెన్సీ(నకిలీ నోట్లు) చలామణి భారీగా పెరిగిపోయింది. సామాన్యులు అసలు, నకిలీ నోట్లకు తేడాను గుర్తించలేరు. ఎందుకంటే నిజమైన నోట్ల లాగే నకిలీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్నారు. దీంతో అక్రమ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఈ నకిలీ నోట్లను ఉగ్రవాదులు కూడా బ్లాక్ మనీగా ఉపయోగించుకుంటున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ దేశంలో నకిలీ నోట్ల చలామణి ఆగడం లేదు. దీంతోపాటు బ్లాక్ మనీ కూడా పెద్ద సమస్యగా మారింది. వీటిని పూర్తిగా అరికట్టేందుకే మోడీ ఈ పథకం అమలు చేయాల్సి వచ్చింది.

2. ఈ పథకం ఏమిటి?

ఈ పథకంలో ఇప్పటి వరకు అమలులో ఉన్న రూ. 500, 1000 నోట్ల చలామణి రద్దవుతుంది. దీంతో వీటితో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేరు. అయితే, తమ వద్ద ఉన్న ఈ నోట్లను రిజర్వు బ్యాంకుకు చెందిన 19 కార్యాలయాలతోపాటు దేశంలోని ఏదైనా బ్యాంకు శాఖలో మార్పిడి చేసుకోవచ్చు.

3. మార్చుకుంటే మొత్తం విలువ వస్తుంగా?

బ్యాంకు శాఖలు, రిజర్వు బ్యాంక్ కార్యాలయాల్లో మీరు మార్చుకునే నోట్లకు పూర్తిగా విలువను పొందడం జరుగుతుంది.

4. మొత్తం నగదు పొందవచ్చా?

లేదు. మీరు వ్యక్తిగతంగా నోట్లను మార్చుకుంటే రూ. 4000లు మాత్రమే బ్యాంకు ద్వారా పొందగలరు. అంతకన్నా ఎక్కువైతే బ్యాంకులో క్రెడిట్ చేసుకోవచ్చు.

5. నా దగ్గర ఉన్న మొత్తాన్ని బ్యాంకులో ఇచ్చి నగదుగా ఎందుకు పొందలేను?

ఈ పథకం లక్ష్యాల కారణంగా మీరు కావాల్సిన మొత్తాన్ని పొందడం సాధ్యం కాదు.

6. రూ. 4000వేలు నా అవసరాలకు సరిపోకపోతే, ఏం చేయాలి?

మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నట్లయితే చెక్కు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్స్, ఐఎంపీఎస్, క్రెడిట్/డెబిట్ కార్డులు మొదలైన వాటితో మీ అవసరాలను తీర్చుకోవచ్చు.

7. నాకు బ్యాంకు ఖాతా లేకపోతే ఏం చేయాలి?

కేవైసీ నిబంధనల ప్రకారం మీరు ఎప్పుడైనా బ్యాంక్ శాఖను సంప్రదించి అవసరమైన పత్రాలు సమర్పించి బ్యాంకు ఖాతా తెరచుకోవచ్చు.

Rs 500, Rs 1000 notes scrapped: 25 things RBI wants you to know

8. ఒక వేళ నేను జేడీవై మాత్రమే కలిగి ఉంటే?

నిబంధనల ప్రకారం జేడీవై ఖాతాదారు కూడా నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఇది పరిమితులకు లోబడి, నిబంధనల ప్రకారం చేయాల్సి ఉంటుంది.

9. నేను నోట్ల మార్పిడి కోసం ఎక్కడికి వెళ్లాలి?

ఆర్బీఐతోపాటు కమర్షియల్ బ్యాంక్స్/ఆర్ఆర్‌బీఎస్/యూసీబీఎస్/స్టేట్ కోఆపరేటివ్ బ్ాయంక్స్ లేదా ఏదైనా హెడ్ పోస్టాఫీసు, లేదాస బ్ పోస్టాఫీసులో నోట్లను మార్చుకోవచ్చు.

10. నేను బ్యాంక్ బ్రాంచ్‌కు వెళితే సరిపోతుందా?

ఏదైనా గుర్తింపు కార్డుతో ఏదైనా బ్యాంకు శాఖలో రూ. 4000 వరకు నోట్ల మార్పిడి చేసుకోవచ్చు. రూ. 4000వేల కంటే ఎక్కువగా కావాలంటే మీరు మీకు ఖాతా ఉన్న బ్యాంకును లేదా ఆ బ్యాంకుకు సంబంధించిన బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి క్రెడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కావాల్సిన పత్రాలు చూపించి ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

11. నా బ్యాంకుకు చెందిన ఏదైనా బ్రాంచ్‌ను సంప్రదించవచ్చా?

అవును. మీకు ఖాతా ఉన్న బ్యాంకుకు సంబంధించిన ఏదైనా బ్రాంచ్‌ను మీరు సంప్రదించవచ్చు.

12. వేరే ఇతర బ్యాంకు బ్రాంచ్‌కు కూడా వెళ్లవచ్చా?

వెళ్లొచ్చు. మీరు ఏదైనా ఇతర బ్యాంకు శాఖకు కూడా వెళ్లి నోట్లను మార్పుచుకోవచ్చు. అయితే, ఇందుకు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు మార్చుకునే మొత్తం రూ. 4000లకు మించి ఫండ్ ట్రాన్సర్ చేస్తే.. గుర్తింపు కార్డుతోపాటు బ్యాంకు వివరాలు కూడా అందజేయాల్సి ఉంటుంది.

13. నాకు ఖాతా లేదు, కానీ, మా ఫ్రెండ్, బంధువుల ఖాతాలో డబ్బులను మార్చుకోవచ్చా?

మార్చుకోవచ్చు. అయితే, మీకు ఖాతాదారుడైన ఫ్రెండ్ లేదా బంధువులు రాతపూర్వకంగా ఏదైనా పత్రం సమర్పించాల్సి ఉంటుంది. మీ గుర్తింపు కార్డుతోపాటు ఖాతాదారులు రాసిచ్చిన పత్రాని చూపించి నోట్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.

14. నేను వ్యక్తిగతంగా వెళ్లాలా? ప్రతినిధిని పంపినా సరిపోతుందా?

వ్యక్తిగతంగా బ్రాంచ్‌ను సంప్రదించడం మంచిది. ఒక వేల మీకు సాధ్యం కాకపోతే, మీరు మీ ప్రతినిధిని పంపవచ్చు. అయితే, వారికి అథరైజేషన్ ఇస్తున్నట్లు రాతపూర్వకంగా తెలపాలి. అతని గుర్తింపు కార్డు, మీరిచ్చిన అథరైజేషన్ ద్వారా నోట్లు మార్పిడి చేసుకోవచ్చు.

15. ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చా?

ఇందుకు కొంత సమయం పడుతుంది. బ్యాంకులు వాటి ఏటీఎంలను సిద్ధం చేసే పనిలో ఉన్నాయి. ఏటీఎంలు పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత నవంబర్ 18, 2016 వరకు రోజుకు రూ. 2000లు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
నవంబర్ 19, 2016 నుంచి ఈ మొత్తాన్ని రోజుకు రూ. 4000లకు పెంచడం జరుగుతుంది.

16. చెక్కు ద్వారా నగదు డ్రా చేసుకోవచ్చా?

అవును. చెక్కు ద్వారా నగదు డ్రా చేసుకోవచ్చు. అయితే, అది రోజుకు రూ. 10,000 మాత్రమే. వారానికి రూ. 20,000లకు మించరాదు(ఏటీఎంల నుంచి విత్ డ్రాతో కలిపి). 24నవంబర్, 2016 వరకు ఇది వర్తిస్తుంది.

17. ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్ లేదా క్యాష్ రిసైక్లర్ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చా?

చేసుకోవచ్చు. ఓహెచ్‌డీ(రూ.500, 1000) నోట్లను క్యాష్ డిపాజిట్స్ మెషిన్/క్యాష్ రిసైక్లర్స్ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు.

18. నెఫ్ట్/ఆర్టీజీఎస్/ఐఎంపీఎస్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/మొబైల్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించుకోవచ్చా?

నెఫ్ట్/ఆర్టీజీఎస్/ఐఎంపీఎస్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/మొబైల్ బ్యాంకింగ్/ ఇతర ఎలక్ట్రానిక్/ నగదు రహిత చెల్లింపులను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.

19. ఎంత సమయంలోపు నోట్లను మార్చుకోవాలి?

ఈ పథకం డిసెంబర్ 30, 2016న ముగుస్తుంది. ఓహెచ్‌డీ నోట్లను కమర్షియల్ బ్యాంక్స్, రీజినల్ రూరల్ బ్యాంక్స్, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్, ఆర్బీఐలలో డిసెంబర్ 30 వరకు నోట్లను మార్చుకోవచ్చు.

ఎవరైతే డిసెంబర్ 30, 2016లోగా నోట్లను మార్చుకోలేకపోతారో.. వారు ఆర్బీఐ పేర్కొన్న కొన్ని ఆర్బీఐ శాఖలను అవసరమైన పత్రాలను సమర్పించి పొందవచ్చు.

20. నేను ఇప్పుడు భారతదేశంలో లేను, ఏం చేయాలి?

ఒక వేళ మీకు భారతదేశంలో ఓహెచ్‌డీ నోట్లు ఉన్నట్లయితే.. మీకు తెలిసిన వారికి ఆథరైజేషన్ రాయించి మీ ఖాతాలో ఆ డబ్బులను వేయించుకోవచ్చు. మీరు ఇచ్చిన ఆథరైజేషన్ లెటర్, నోట్లతో మీ బ్యాంకు శాఖను సంప్రదించి ఆ నోట్లను మార్చుకోవచ్చు. ఇందుకు అతను గుర్తింపు కార్డు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ కార్డ్, పాస్ పోర్ట్, ఎన్ఆర్ఈజీఏ కార్డ్, ప్యాన్ కార్డ్, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డ్, పబ్లిక్ సెక్టార్ తమ స్టాఫ్ కు ఇచ్చే గుర్తింపు కార్డును చూపించవచ్చు.

21. నేను ఒక ఎన్నారైని, ఎన్నార్ఓ ఖాథా ఉంది, నేను నా ఖాతాలో డబ్బులు జమ చేసుకోవచ్చా?

చేసుకోవచ్చు. మీ ఎన్నార్ఓ ఖాతాలో ఓహెచ్ డీ నోట్లను జమ చేసుకోవచ్చు.

22. నేను విదేశీ పర్యాటకుడిని, నేను ఈ నోట్లను కలిగి ఉన్నాను, నేనేం చేయాలి?

ఓహెచ్ డీ నోట్లతో రూ. 5000 విలువకు సమానమైన మొత్తాన్ని విమానాశ్రయ ఎక్ఛేంజ్ కౌంటర్లలో 72గంటల్లో పొందవచ్చు.

23. నాకు అత్యవసరంగా డబ్బ అవసరమైంది(ఆస్పత్రి, ట్రావెల్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్), అప్పుడు ఏం చేయాలి?

మీరు మీ ఆస్పత్రి ఖర్చుల కోసం ఓహెచ్ డీ నోట్లను ఉపయోగించుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 72గంటలపాటు కూడా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ బస్టాండ్స్, బస్సులు, స్టేట్ పీఎస్ యూ బస్సులు, రైల్వే స్టేషన్లలోట్రైన్ టికెట్ కొనుగోలు, విమానాశ్రయాల్లో విమాన టికెట్లను ఓహెచ్ డీ నోట్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.

24. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటీటీ ఏమిటి?

చెల్లుబాటయ్యే ఐడెంటీటీ ప్రూఫ్ అంటే.. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్ పోర్ట్, ఎన్ఆర్ఈజీఏ కార్డ్, ప్యాన్ కార్డ్, ప్రభుత్వ శాఖలు జారీ చేసే ఐడెంటీటీ కార్డ్, పబ్లిక్ సెక్టార్‌ యూనిట్ తమ స్టాఫ్‌కు ఇచ్చే గుర్తింపు కార్డులు.

25. ఈ పథకం గురించి నేను మరింత సమాచారాన్ని ఎక్కడ తెలుసుకోవచ్చు?

http://www.rbi.org.in, జీఓఐ వెబ్ సైట్ http://www.rbi.org.inలను సంప్రదించవచ్చు.

26. నాకు ఏదైన సమస్య వస్తే, ఎవర్ని సంప్రదించాలి.

ఈమెయిల్ ద్వారా ఆర్బీఐ కంట్రోల్ రూంను సంప్రదించవచ్చు. లేదా టెలిఫోన్ నెం. 022 22602201/022 22602944 సంప్రదించవచ్చు.

English summary
After the government’s surprise announcement on Tuesday of making Rs 1,000 and Rs 500 banknotes illegal from midnight, the Reserve Bank of India posted a 25-point detailed FAQs explaining the rationale behind the move.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X