వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"30లక్షలు పలుకుతోన్న రూ.5వేల నోటు"

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పెద్ద నగదు నోట్ల రద్దతో దేశవ్యాప్తంగా.. సామాన్యుల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త నోట్లకు దొరక్క ఇబ్బందిపడేవారు కొందరైతే.. దొరికిన రూ.2వేల నోటుకు చిల్లర మార్చుకోలేక తంటాలు పడుతున్నవారు మరికొందరు. మొత్తంగా ఈ వ్యవహారమంతా సద్దుమణగడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది.

కాగా, 1978లో.. అప్పటి మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం తొలిసారిగా నగదు నోట్లను రద్దు చేసింది. ఆ నిర్ణయంతో అప్పటిదాకా అమలులో ఉన్న రూ.1000, రూ.5000 రూ.10వేల నోట్లన్ని రద్దయిపోయాయి. అయితే అప్పటికీ ఆ పెద్ద నగదు నోట్లను వినియోగిస్తున్నవారి సంఖ్య తక్కువ కావడం.. అవి కూడా కేవలం బడాబాబుల వరకే పరిమితం కావడంతో.. సామాన్యులెవరు అంతగా ఇబ్బందులు ఎదుర్కోలేదు.

Rs.5000 Note That Was Banned In 1978 To Be Auctioned For More Than 30 Lakh!

అయితే అప్పటి నోట్లను ఇప్పటిదాకా భద్రపరుచుకున్న కొంతమంది.. ఇప్పుడు వాటిని వేలంలో అమ్మేస్తున్నారు. మరుధర్ ఆర్ట్స్ అనే యాక్షన్ హౌజ్ లో తాజాగా అప్పటి రూ.1000 నోట్లను వేలానికి ఉంచారు. ఆశ్చర్యంగా.. అప్పటి వెయ్యి రూపాయల నోటు ప్రస్తుత వేలంలో రూ.2.4లక్షల ధర పలుకుతుండడం గమనార్హం.

రూ.5వేలు, రూ.10వేల నోట్లను ప్రైవేటుగా అమ్మకానికి పెడుతున్నట్టుగా మరుధర్ ఆర్ట్స్ యాజమాన్యం ప్రకటించింది. వీటి ధర ప్రస్తుతం రూ.30లక్షలు పైనే పలకవచ్చునని యాజమాన్యం చెబుతుండడం గమనార్హం.

English summary
In the year 1978, Morarji Desai government had also banned the high denomination notes. The notes of Rs. 1000, 5,000 and a 10,000 (yes, there was a note of Rs. 10k too!) then became redundant when the ban was announced. However, there are some people who have kept the notes and are now auctioning them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X