viral:భారీ సమోసా.. అరగంటలో తింటే ప్రైజ్ మనీ ఎంతంటే...?
తమ హోటల్/ షాపు ప్రచారం కోసం ఫుడ్ గేమ్స్ కంపల్సరీ.. పిజ్జా, బర్గర్.. రకరకాల వంటకాలు పెడతారు. వారికి క్యాష్ ఫ్రైజ్ కూడా ఇస్తారు. అయితే ఇందులో ఓ షరతు ఉంటుంది. అదే ఇంత సమయంలో తినాలని అని ఉంటుంది. అవును మీరట్‌లో ఓ షాపు యజమాని కూడా అలానే చేశారు. కానీ బాహుబలి సమోసను పెట్టారు. దానిని ఆరగిస్తే రూ.51 వేలు ఇస్తామని ప్రకటించింది.
ఒక సమోసా తింటే చాలు.. రూ.51 వేలు ఇస్తామంటే ఏం చేస్తారు? ఒక్క సమోసాయేనా.. లాగించేయొచ్చని అనుకోవద్దు. కానీ ఇది 'బాహుబలి' సమోసా.. ఎనిమిది కిలోల బరువుతో తయారు చేశారు. అర గంటలో తింటే రూ.51 వేలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన కౌశల్ స్వీట్ షాప్ ఈ ఆఫర్ ఇచ్చారు. సో ట్రై చేసేవారు ఏంచక్కా చేయచ్చు.

శుభమ్ అనే యువతి స్వీట్ షాప్‌కు ప్రచారం వచ్చేందుకు ఏం చేయాలని ఆలోచించింది. సరికొత్తగా చేయాలనే ఉద్దేశంతో పేద్ద సమోసాను తయారు చేసింది. ఆలూ, వెన్న, బఠానీ, డ్రై ఫ్రూట్స్ వేసి 8 కిలోల సమోసాను రూపొందించింది. సమోసాను అర గంటలో తిన్నవారికి రూ.51 వేలు బహుమతి ఇస్తానని ప్రకటించింది. విషయం అందిరికీ తెలిసి బాగా ప్రచారం వచ్చింది. 'బాహుబలి' సమోసాను తినేందుకు ప్రయత్నించినా.. అర గంటలో పూర్తి చేయలేకపోయారు.
సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. అనుకున్న దానికంటే ఎక్కువ ప్రచారం వచ్చింది. సో ఇప్పుడు శుభమ్ హ్యాపీ.. తమ షాపుకు తగిన గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నారు. సో ట్రై చేసే వారు ఎంచక్కా ప్రయత్నించవచ్చు.












Click it and Unblock the Notifications