ఆర్ఎస్ఎస్ లీడర్ ను కాల్చిచంపారు
జార్ఖండ్: ఒంటరిగా బైక్ లో వెళుతున్న ఆర్ఎస్ఎస్ నాయకుడిని రివాల్వర్లతో కాల్చి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన జార్ఖండ్ లో జరిగింది. జార్ఖండ్ లోని కుంతి జిల్లా లోని గుడిజోరా అనే గ్రామం శివార్లలో దుండగులు బరి తెగించారు.
గుడిజోరా గ్రామానికి చెందిన కరంబీర్ మెహతో (21) జిల్లా ఆర్ఎస్ఎస్ నాయకుడిగా పని చేస్తున్నాడు. ఇతను బైక్ లో తన గ్రామానికి బయలుదేరాడు. అదే సమయంలో మూడు బైక్‌లపై వెళ్లిన నిందితులు రివాల్వర్లతో కరంబీర్ మెహతో మీద కాల్పులు జరిపారు.

తీవ్రగాయాలు కావడంతో కరంబీర్ మెహతో కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన గ్రామస్తులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కరంబీర్ మెహతో మరణించాడని కుంతి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
పాతకక్షల కారణంగా కరంబీర్ మెహతో హత్యకు గురైనాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కరంబీర్ హత్యతో జార్ఖండ్ లో ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications