కొత్త విదేశాంగ కార్యదర్శి: కాంగ్రెస్ విమర్శలు, రాజకీయ ఉద్దేశ్యం లేదని బీజేపీ

న్యూఢిల్లీ: గురువారం న్యూఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయంలో నూతన కార్యదర్శిగా ఎస్. జైశంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యాలే తన ప్రాధాన్యాలని నూతన విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంలో విదేశాంగ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్. జైశంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ఎస్. జైశంకర్‌ను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన నియామకాలపై మంత్రివర్గ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలు వచ్చిన వెంటనే, జై శంకర్ బాధ్యతలు స్వీకరించారు.

S Jaishankar ​replaces Sujatha Singh as new foreign secretary, says govt's priorities are his priorities

నిన్నటి వరకు విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతా సింగ్ పదవీ కాలం ఇంకా 8 నెలలు మిగిలి ఉండగానే ఆమెను పదవి నుంచి తప్పించారు. భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన ముగిసిన తర్వాతి రోజే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని, సుజాతా సింగ్ ఆ పదవి నుంచి అమార్యదగా తప్పించారని కాంగ్రెస్ పార్టీ లీడర్ మనిష్ తివారీ ట్విట్టర్‌లో మోడీ ప్రభుత్వంలో ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ నియామకాల్లో రాజకీయ ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. ఆగస్టు 2013లో విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సుజాతా సింగ్ ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కావాల్సి ఉంది.

ఇక జైశంకర్ 2004 నుంచి 2007 వరకు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఉమ్మడి కార్యదర్శిగా అమెరికాతో చేసిన అణు ఒప్పందం చర్చల్లో కీలక పాత్ర పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+