Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sabarimala: శబరిమల అయ్యప్ప దర్శనం, నేటి నుంచి ఆన్ లైన్ బుకింగ్ కు అవకాశం, చివరి చాన్స్ తో భక్తులు !

శబరిమల/ కొచ్చి/ హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలలో మకరవిలక్కు పండుగ సందర్బంగా అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులకు ఈ ఏడాది చివరిగా చక్కటి అవకాశం వచ్చింది. శబరిమల మకరవిలక్కు యాత్రకు జనవరి 8వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు వెళ్లే భక్తులు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి జనవరి 6వ తేదీ ( నేడు) సాయంత్రం 6 గంటల నుంచి ఆన్ లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. శబరిమలకు వెళ్లే భక్తులు నేటి సాయంత్రం నుంచి ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి సిద్దం అయ్యారు. శబరిమలకు బయలుదేరే 48 గంటల ముందు ప్రతి భక్తుడు ఆర్ టీపీసీఆర్/ న్యాట్ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని శబరిమల ఆలయ కమిటీ బోర్డు అధికారులు సూచించారు.

శబరిమల మకరవిలక్కు యాత్ర

శబరిమల మకరవిలక్కు యాత్ర

కేరళలోని శబరిమలలో మకరవిలక్కు పండుగ ఉత్సవాలు మొదలైనాయి. 2021 జనవరి 19వ తేదీ వరకు మకరలవిలక్కు యాత్ర జరుగుతుంది. ఇప్పటికే శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అయ్యప్పస్వామి భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పటికే జనవరి 7వ తేదీ వరకు ఆన్ లైన్ టిక్కెట్ల రిజర్వేషన్ పూర్తి అయ్యింది.

నేటి నుంచి ప్రారంభం

నేటి నుంచి ప్రారంభం

మకరవిలక్కు యాత్రకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం అనేక నియమాలు విధించింది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన అయ్యప్పస్వామి భక్తులు ఇప్పటికే శబరిమలలో మకరవిలక్కు ఉత్సవం రోజు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఆన్ లైన్ లో టిక్కెట్లు రిజర్వు చేసుకున్నారు. జనవరి 8వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు శబరిమలకు వెళ్లే భక్తులు నేటి సాయంత్రం 6 గంటల (జనవరి 6వ తేదీ బుధవారం) నుంచి ఆన్ లైన్ లో టిక్కెట్లు బుకింగ్ చేసుకోవడానికి అధికారులు అవకాశం ఇచ్చారు.

అయ్యప్ప భక్తుల ఆశ

అయ్యప్ప భక్తుల ఆశ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళతో సహ దేశంలోని వివిద రాష్ట్రాలకు చెందిన అయ్యప్పస్వామి భక్తులు మకరవిలక్కు (సంక్రాంతి) పండుగ రోజు శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని జ్యోతి దర్శనం చేసుకోవాలని ఆశపడుతూ ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకుని ఆరోజు శబరిమలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.

 ఇబ్బంది పడకూడదని మనవి

ఇబ్బంది పడకూడదని మనవి


సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లడానికి అవకాశం చిక్కడంతో అయ్యప్పస్వామి భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ కేసుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే మకరవిలక్కు పండుగ సందర్బంగా శబరిమలకు రావాలని, టిక్కెట్లు బుక్ చేసుకోని వారు ఎవ్వరూ శబరిమలకు రాకూడదని, శబరిమలకు వచ్చి ఇబ్బందులకు గురి కాకూడదని TDB అధికారులు, శబరిమల ఆలయ కమిటీ బోర్డు నిర్వహకులు అయ్యప్పస్వామి భక్తులకు మనవి చేస్తున్నారు.

ఈఒక్కసారికి అంతే

ఈఒక్కసారికి అంతే

మకరవిలక్కు ఉత్సవాల సందర్బంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను ఇప్పటికే 5, 000కు పెంచారు. అయితే మకరవిలక్కు యాత్రలో ఎంతో ముఖ్యమైన జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ రోజు 5 వేల మంది భక్తుల మినహా ఏ ఒక్కరు అధిక సంఖ్యలో సన్నిధానంలోకి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వడం లేదని, ఆరోజుకూడా 5 వేల మంది మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఇస్తున్నామని శబరిమల దేవాలయం ఆలయ కమిటీ బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు తేల్చిచెప్పారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+