హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sabarimala: శబరిమలలో ఆదాయం కంటే ఖర్చు నాలుగింతలు, నిన్న రూ. 82 కోట్లు, నేడు రూ. 4 కోట్లు, ఎందుకంటే !

|
Google Oneindia TeluguNews

శబరిమల/ కొచ్చి/ హైదరాబాద్: భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య చాలా తక్కువ అయ్యింది. కరోనా వైరస్ నియమాలు (COVID-19) కఠినంగా ఉండటం, కరోనా వైరస్ భయంతో చాలా మంది శబరిమలకు వెళ్లలేపోతున్నారు. శబరిమలకు ఇప్పటి వరకు వెళ్లిన అయ్యప్ప భక్తుల సంఖ్య సుమారు 50, 000కు చేరుకుంటున్నది. ప్రతిఏడాది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే శబరిమల ఆలయం ఇప్పుడు ఆదాయం తగ్గిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి రూ. 82 కోట్లు ఆదాయం వస్తే ఈ ఏడాది రూ. 4 కోట్ల మాత్రమే ఆదాయం వచ్చింది. ప్రస్తుతం శబరిమలకు ఆదాయం కంటే ఖర్చు నాలుగింతలు ఎక్కువైయ్యిందని దేవస్వం బోర్డు అంటోంది.

Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!

 శబరిమలలో కనిపించని రద్దీ

శబరిమలలో కనిపించని రద్దీ

భారతదేశంలో కరోనా వైరస్ తాండవం చేసి ఇప్పుడు ఇప్పుడే శాంతిస్తోంది. కరోనా వైరస్ (COVID- 19) మహమ్మారి దెబ్బకు కేరళ ప్రభుత్వం అయ్యపస్వామి భక్తులకు ఇప్పటికే అనేక నియమాలు విధించింది. అతి కష్టం మీద కేరళ ప్రభుత్వం విధించిన రూల్స్ పాటిస్తూ అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి రెండు నెలల నుంచి ఆన్ లైన్ లో అనుమతి తీసుకుంటున్న అయ్యప్ప భక్తులు శబరిమలకు వెలుతున్నారు. శబరిమలలో అయ్యపస్వామిని దర్శించుకుంటున్న అయ్యప్పస్వామి భక్తులు తరువాత మొక్కులు చెల్లించుకుని వారి సొంత ప్రాంతాలకు చాలా సంతోషంగా తిరిగి వెలుతున్నారు.

 సహకరించని ప్రకృతి

సహకరించని ప్రకృతి

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ సంవత్సరం ప్రకృతి కూడా సహకరించలేదని చెప్పాలి. శబరిమలకు అయ్యప్పస్వామి భక్తుల తీర్థయాత్ర మొదలైన తరువాత వరుసగా రెండు తుపాన్లు విరుచుకుపడ్డాయి. నివర్ తుపాను కారణంగా అయ్యప్పస్వామి భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. తరువాత కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. నివర్ తుపాను వెళ్లిపోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి బురేవి తుపాను రూపంలో భారీ వర్షాలు పడటంతో అయ్యప్పస్వామి భక్తులు కొంత ఆందోళనకు గురైనారు.

 అందుకే అలా జరిగింది

అందుకే అలా జరిగింది

కేరళలో నివర్, బురేవి తుపాన్ల కారణంగా భారీ వర్షాలు పడటంతో శబరిమలకు వచ్చి వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని శబరిమల దేవస్వం బోర్డు, కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు మనవి చేసింది. ఏది ఏమైనా సరే ముందుగా ఆన్ లైన్ లో డేట్ ఫిక్స్ చేసుకున్న అయ్యప్ప భక్తులు అనుకున్న సమయానికి అయ్యప్పస్వామిని దర్శించుకోవాడానికి వెళ్లారు. అయితే భారీ వర్షాల కారణంగా చాలా మంది భక్తులకు సమస్యలు ఎదురుకావడంతో అనుకున్న సమయానికి శబరిమలకు చేరుకోలేకపోయారని అధికారులు తెలిపారు.

 23 రోజుల్లో 44 వేల మంది

23 రోజుల్లో 44 వేల మంది

ట్రావంకోర్ దేవస్వం బోర్డు అధికారుల అంచనాల ప్రకారం డిసెంబర్ 8వ తేదీ వరకు శబరిమలకు 44, 000 మంది భక్తులు మాత్రమే వెళ్లారు. శబరిమల ఆలయంలోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి ఇచ్చిన 23 రోజుల్లో కేవలం 44 వేల మంది మాత్రమే శబరిమలకు వెళ్లడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. శుక్రవారం నాటికి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య సుమారు 50, 000కు చేరుకుంటుందని అధికారులు అంచనా వేశారు.

 ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు భక్తులు

ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు భక్తులు

ఇప్పటి వరకు శబరిమలకు వెళ్లిన భక్తులు ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చిన వారే అని దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది శబరిమలకు వచ్చివెళ్లే భక్తులు సంఖ్య చాలా తగ్గిపోయిందని స్వయంగా అధికారులే అంటున్నారు. గత ఏడాది ఇదే నాటికి కొన్ని లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వచ్చి వెళ్లారని దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు.

 శబరిమల ఆదాయం నిన్న రూ. 82 కోట్లు, నేడు రూ. 4 కోట్లు

శబరిమల ఆదాయం నిన్న రూ. 82 కోట్లు, నేడు రూ. 4 కోట్లు

గత ఏడాది ఇదే నాటికి శబరిమలకు రూ. 82 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం రూ. 4 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని, భక్తుల సంఖ్య ఘననీయంగా పడిపోవడం వలనే ఇలా జరిగిందని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు అంటున్నారు. మొత్తం మీద శబరిమలకు వచ్చి వెలుతున్న భక్తుల సంఖ్యతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన ఆదాయం పర్వాలేదు అనిపిస్తోందని అధికారులు చెప్పారు.

Recommended Video

#SabarimalaTemple: కేరళలో భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయం ... మకరవిలక్కు పూజకు 5 వేలమందికి అనుమతి !
 ఖర్చు నాలుగింతలు

ఖర్చు నాలుగింతలు

శబరిమలలో ప్రస్తుతం ఆదాయం కంటే ఖర్చు మాత్రం నాలుగింతలు అవుతోందని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు 2 వేల మంది, శనివారం, ఆదివారం రోజుల్లో 3 వేల మంది మాత్రమే శబరిమలకు వెళ్లడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోవడం వలనే శబరిమలకు ఎన్నడూ లేని విధంగా ఆదాయం తగ్గిపోయిందని దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు.

English summary
Sabarimala: Sabarimala temple officials says the cost of organising the pilgrimage is estimated to become at least four times the revenue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X