కొడుకుతో ఆడుకుంటావా! మనవడితోనా?: డిగ్గీపై సాధ్వి
గోరఖ్‌పూర్: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే.. భారతీయ జనతా పార్టీ మహిళా నేత సాధ్వి ప్రాచీ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను విమర్శిస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ పెళ్లి విషయంలోనూ ఆమె ఎద్దేవా చేశారు. ఆయన ఇటీవల అమృతా సింగ్ అనే మహిళను వివాహమాడిన సంగతి తెలిసిందే.

‘ఈ వయసులో పెళ్లి చేసుకున్నారు.. కొడుకుతో ఆడుకుంటారా... మనవళ్లతో ఆడుకుంటారా..' అంటూ సాధ్వి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయాలకు పనికిరారని.. అది ఆయన తల్లి సోనియాగాంధీకి తెలుసునని, అందుకే రాహుల్‌ని బిహార్ ఎన్నికల సమయంలో అమెరికా పర్యటనకు పంపారని ఆమె విమర్శించారు.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పైనా విమర్శలు గుప్పించారు. గడ్డి తిని లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లారని, ఆ సమయంలో ఆయన భార్య ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. అలాంటి వ్యక్తి మాటలను బీహార్ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications