Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sadist: భార్య, కూతురిని ఆటోలో పెట్టి లాక్ చేసి పెట్రోల్ పోసి, బాణాసంచాకు నిప్పు, సజీవదహనం !

కొచ్చి/కోజికోడ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం పాటు భార్య, పిల్లలతో సంతోషంగా జీవించిన భర్త తరువాత మద్యం తాగడానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి చేశాడని కేసు నమోదు కావడంతో భర్త జైలుకు వెళ్లాడు. ఏడాదిపాటు జైల్లో ఉన్న భర్త తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. తాను జైలుకు వెళ్లడానికి తన భార్య పరోక్షంగా కారణం అయ్యిందని, పిల్లలు కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నారని భర్త రగిలిపోయాడు. ఎలాగైనా కుటుంబ సభ్యులు అందరినీ చంపేయాని భర్త స్కెచ్ వేశాడు. రంజాన్ పండుగ సందర్బంగా భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్నట్లు నటించిన భర్త వాళ్లను చంపేయాలని ప్లాన్ వేశాడు. ఆటోలో భార్య, పెద్ద కుమార్తెను ఎక్కించుకున్న భర్త వారిని పిలుచుకుని బయలుదేరాడు. మార్గం మద్యలో గూడ్స్ ఆటో డోర్ లో లాక్ చేసిన కిరాతకుడు అతని భార్య, కూతురి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

భార్య, కుమార్తె తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా చేసిన భర్త బావిలో దూకేశాడు. అప్పటికే గూడ్స్ ఆటోలో భారీగా బాణాసంచాతో పాటు పేలుడు పదార్థాలు పెట్టడంతో ఆటో ఒక్కసారిగా పేలిపోయింది. మంటల్లో కాలిపోయిన తల్లీ, కూతురు ఆటోలోనే సజీవదహనం అయ్యారు. పక్కనే ఉన్న బావిలో భర్త కూడా శవమైకనించాడు. పెట్రోల్ లో చెక్కర కూడా మిక్స్ చెయ్యడంతో మంటలు జోరుగా వ్యాపించాయని, స్థానికులు తల్లీ కూతురిని రక్షించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని పోలీసు అధికారులు అంటున్నారు.

 భార్య, పిల్లలతో కాపురం

భార్య, పిల్లలతో కాపురం

కేరళలోని మల్లప్పురం సమీపంలోని కీజాత్తూరు పంచాయితీ పరిధిలోని కరువరకుండులో మహమ్మద్ (52) అనే వ్యక్తి అతని భార్య జాస్మిన్ (38), కూతుర్లు ఫాతిమా మత్ సఫా అలిమాస్ ఫాతిమా (11) షిఫానా (5)తో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంతకాలం పాటు భార్య జాస్మిన్, ఇద్దరు కూతుర్లతో సంతోషంగా జీవించిన మహమ్మద్ తరువాత మద్యం తాగడానికి బానిస అయ్యాడు.

 జైలుకు వెళ్లిన భర్త

జైలుకు వెళ్లిన భర్త

గత ఏడాదిలో మద్యం మత్తులో మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి చేశాడని కేసు నమోదు కావడంతో మహమ్మద్ జైలుకు వెళ్లాడు. ఏడాదిపాటు జైల్లో ఉన్న మహమ్మద్ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. తాను జైలుకు వెళ్లడానికి తన భార్య జాస్మిన్ పరోక్షంగా కారణం అయ్యిందని, పిల్లలు కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నారని మహమ్మద్ రగిలిపోయాడు.

 రంజాన్ పండుగ తరువాత స్కెచ్

రంజాన్ పండుగ తరువాత స్కెచ్

ఎలాగైనా తన కుటుంబ సభ్యులు అందరినీ చంపేయాని మహమ్మద్ స్కెచ్ వేశాడు. రంజాన్ పండుగ సందర్బంగా ఊరికి వెళ్లిన భార్య జాస్మిన్, పిల్లలతో సంతోషంగా ఉన్నట్లు నటించిన మహమ్మద్ వాళ్లను చంపేయాలని ప్లాన్ వేశాడు. గూడ్స్ ఆటోలో భార్య జాస్మిన్, కుమార్తెలు ఫాతిమా, షిఫానాను ఎక్కించుకున్న భర్త వారిని పిలుచుకుని ఇంటికి బయలుదేరాడు.

 ఆటో డోర్ లాక్ చేసి నిప్పంటించిన భర్త

ఆటో డోర్ లాక్ చేసి నిప్పంటించిన భర్త

మార్గం మద్యలో గూడ్స్ ఆటో డోర్ లో లాక్ చేసిన కిరాతకుడు మహమ్మద్ అతని భార్య జాస్మిన్, కూతుర్లు ఫాతిమా, షిపానా మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. భార్య జాస్మిన్, కుమార్తె ఫాతిమా తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా చేసిన మహమ్మద్ సమీపంలోని బావిలో దూకేశాడు. అదే సమయంలో చిన్న కుమార్తె షిఫానా కాలిన గాయాలతో తప్పించుకుంది.

 ఆటోలో భారీగా బాణాసంచా స్టాక్ పెట్టాడు

ఆటోలో భారీగా బాణాసంచా స్టాక్ పెట్టాడు

అప్పటికే గూడ్స్ ఆటోలో భారీగా బాణాసంచాతో పాటు పేలుడు పదార్థాలు పెట్టడంతో ఆటో ఒక్కసారిగా పేలిపోయింది. మంటల్లో కాలిపోయిన తల్లీ, కూతురు జాస్మీన్, ఫాతిమా ఆటోలోనే సజీవదహనం అయ్యారు. పక్కనే ఉన్న బావిలో మహమ్మద్ కూడా శవమైకనించాడు.

 పెట్రోల్ లో స్పటికం, చెక్కర మిక్స్ చేశాడు

పెట్రోల్ లో స్పటికం, చెక్కర మిక్స్ చేశాడు

పెట్రోల్ లో స్పటికం, చెక్కర కూడా మిక్స్ చెయ్యడంతో మంటలు జోరుగా వ్యాపించాయని, స్థానికులు తల్లీ కూతుర్ని రక్షించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద పక్కాస్కెచ్ భార్య కూతురిని సజీవదహనం చేసిన మహమ్మద్ అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+