అమెరికాలో పుట్టి.. భారత్ లో సేవ.. పూర్వికులకు ఇచ్చిన మాటతో..

సొంత ఊరిలో పుట్టి, పెరిగి.. పై చదువులు అంటూ విదేశాలకు వెళ్లి.. బాగా సంపాదించి అక్కడే స్థిరపడుతున్న రోజులివి. అలాంటిది ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. తన పూర్వికులది మనదేశమేనని తెలుసుకుని ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్న ఈ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ కాలంలో మథర్ థెరిసా ను చూడలేకపోయినా.. ఈమె రూపంలో చూసుకునే అదృష్టం దొరికిందని భావిస్తున్నారు.

Sally Holkar American-Born Honored with Padma Shri for Contributions to Maheshwari Handloom

ఈమె పేరు సల్లీ హోల్కర్. వయసు 82 సంవత్సరాలు. పుట్టిపెరిగింది అమెరికాలో. చదివింది స్టాన్ ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలో కానీ ఆమె అమెరికా లోనే స్థిరపడాలని భావించలేదు. తన తాతముత్తాతలు భారత్ లో జమిందారులు.. ప్రఖ్యాత హోల్కర్ రాజ్య వంశానికి చెందినవారు. దీంతో ఆమెకు అమెరికానే పరాయి దేశంగా అనిపించింది. ఇండియానే తన కన్నతల్లి అని స్వదేశానికి తిరిగి వచ్చేశారు.

18వ శతాబ్దం నుంచే..

మధ్యప్రదేశ్ ను పరిపాలించిన రాజ్య వంశస్థుల్లో హోల్కర్ వంశం ఒకటి. అయితే ఈ హోల్కర్ వంశం మధ్యప్రదేశ్ నర్మదా నది తీరంలో 18వ శతాబ్దం నుంచే మహేశ్వరి చేనేత వస్త్రాలను అభివృద్ధి చేయడంలో దోహదపడ్డారు. స్థానికంగా ఉండే చేనేత కార్మికులకు బాసటగా నిలుస్తూ ఈ మహేశ్వరి హ్యాండ్ లూమ్ బ్రాండ్ ను విస్తరించారు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్ లో ఈ హ్యాండ్ లూమ్స్ కు ఎంతో పేరు వచ్చింది. అయితే ఈ హోల్కర్ వంశానికి చెందిన వారసురాలే సల్లీ హోల్కర్.

Sally Holkar American-Born Honored with Padma Shri for Contributions to Maheshwari Handloom

1971లో భారత్ కు ..

సల్లీ హోల్కర్ తన భర్త రిచార్డ్ తో కలిసి 1971లో భారత్ కు వచ్చారు. ఆమె వచ్చేనాటికి ఆ ప్రాంతంలో మహేశ్వరి హస్తకళ పూర్తిగా చిన్నాభిన్నం అయింది. ఆ చేనేత కళ ఆదరణకు నోచులేకపోయింది. దీంతో ఆమె 1978 నుంచి నర్మదా నది ఘాట్స్, వీధుల్లో తిరుగుతూ చేనేత కుటుంబాల్లో ధైర్యాన్ని నింపారు. చేనేత కుటుంబాలతో మమేకపై..వారి కష్టాల్లో పాలుపంచుకున్నారు. అలా మెల్లగా చేనేత కుటుంబాలను ఒక్కటి చేసి 2003లో స్థానికంగా ఓ స్టోర్ ప్రారంభించారు. ఆ స్టోర్ లో మహేశ్వరి హ్యాండ్ లూమ్ బ్రాండ్ పేరిట వస్త్రాలను విక్రయించడం ప్రారంభం చేశారు. అలా మహేశ్వరి బ్రాండ్ ను పాపులర్ చేశారు. అలా స్టోర్స్ ను కూడా విస్తరించారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

పద్మశ్రీ పురస్కారంతో..

భావితరాల కోసం సల్లీ హోల్కర్ 2015లో ఓ చేనేత పాఠశాల ప్రారంభించారు. దాదాపు 5వేల మంది పిల్లలకు చేనేత కళలో మెలకువలు నేర్పిస్తున్నారు. దాదాపు 50 ఏళ్లుగా చేనేత రంగంలో ఆమె చేస్తున్న కృషికి, మహిళా సాధికారతకు గుర్తుగా ఆమెకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+