ఆర్యన్ ఖాన్ ను వదిలేసేందుకు రూ.25 కోట్లు అడిగిన సమీర్ వాంఖడే-సీబీఐ ఎఫ్ఐఆర్...

మహారాష్ట్రలో రెండేళ్ల క్రితం తీవ్ర కలకలం రేపిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన నార్కోటిక్స్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. క్రూయిజ్ లో డ్రగ్స్ తీసుకుంటూ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దొరికినట్లు ప్రకటించి అరెస్టు చేసిన సమీర్ వాంఖడే ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆర్యన్ ఖాన్ ను సమీర్ వాంఖడే అరెస్టు చేయడంతో ఆయన్ను వివాదాలు చుట్టుముట్టాయి.

ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేసి నానా హంగామా చేసిన సమీర్ వాంఖడేను అప్పట్లోనే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. అనంతరం అక్కడ ప్రభుత్వం మారినా వాంఖడేను చుట్టుముట్టిన వివాదాలు సమసిపోలేదు. ఇంకా పెరిగాయి. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఓవైపు ఆర్యన్ ఖాన్ బెయిల్ పై విడుదల కాగా.. మరోవైపు ఈ కేసులో సమీర్ వాంఖడే పోషించిన పాత్ర పై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇప్పుడు సీబీఐ ఈ వ్యవహారంలో దాఖలు చేసిన తాజా ఎఫ్ఐఆర్ లో ఆయనపై తీవ్ర అభియోగాలు మోపింది.

sameer wankhede

ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసు నుంచి తప్పించేందుకు సమీర్ వాంఖడే రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు సీబీఐ తాజా ఎఫ్ఐఆర్ లో ఆరోపించింది. సమీర్ ప్రస్తుతం తీవ్ర అవినీతి, దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించింది. షారుక్ ఖాన్ కుటుంబం రూ.25 ఇవ్వకపోతే ఆర్యన్ ను డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని సమీర్ వాంఖడే బెదిరించినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. 2021 అక్టోబరులో ముంబయిలో క్రూయిజ్ షిప్‌లో మాదక ద్రవ్యాల దోపిడీలో ఆర్యన్ ఖాన్, ఇతరుల అరెస్ట్ తర్వాత వార్తల్లో నిలిచిన వాంఖడే అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

sameer wankhede

తన ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ.. సమీర్ వాంఖడే విదేశీ పర్యటనలు, ఖరీదైన చేతి గడియారాల అమ్మకం, కొనుగోలు చేసినట్లు ఆరోపించింది. వాంఖడే, ఎన్‌సిబిలో అప్పటి ఇంటెలిజెన్స్ అధికారి ఆశిష్ రంజన్‌లపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి వారు ప్రకటించిన ఆదాయం ప్రకారం సంపాదించిన ఆస్తులను సమర్థించుకోలేకపోయారని సీబీఐ ఆరోపించింది. వాంఖడే, "తన విదేశీ పర్యటనలను సరిగ్గా వివరించలేదని, విదేశీ ప్రయాణాల ఖర్చులను తప్పుగా ప్రకటించినట్లు పేర్కంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+