బీహార్ లో సీన్ రివర్స్, గెలుపు వారిదే- తేల్చేసిన ప్రముఖ సర్వే..!!

బీహార్ లో తొలి విడత పోలింగ్ వేళ ఆసక్తి కర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. హోరా హోరీగా కనిపిస్తున్న అసెంబ్లీ సమరంలో గెలిచేదెవరనేది సస్పెన్స్ గా మారుతోంది. ఎవరికి వారు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల తరువాత ఎన్డీఏ తో పాటుగా.. జాతీయ స్థాయిలో రాజకీయంగా సమీకరణాలు మారుతాయనే చర్చ ఉంది. అయితే, ప్రముఖ సర్వే సంస్థ ఎస్ఏఎస్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు లోకి వచ్చాయి. పబ్లిక్ మూడ్ తో పాటుగా పార్టీల బలాబలాలను వెల్లడించింది. ప్రజల మూడ్ పైన స్పష్టత ఇచ్చింది.

బీహార్ అసెంబ్లీ సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. తొలి విడత పోలింగ్ లోనే ప్రభుత్వం ఎవరిదనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఏ - ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల మహా ఘట్ బంధన్ ల మధ్య పోటీ కొనసాగుతోంది. ఎస్ఏఎస్ సంస్థ చేసిన ప్రజాభిప్రాయణలో కీలక అంశాల ను వెల్లడించింది. రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని విశ్లేషించింది. ఎన్డీఏ కు ప్రధాని మోదీ, అమిత్ షా స్టార్ క్యాంపెయినర్లు కాగా.. కూటమికి స్థానిక నాయకత్వమే ఎక్కడికి అక్కడ ప్రచారం చేస్తోంది. కూటమి నేతలు ఇస్తున్న ఉద్యోగ కల్పన, ప్రభుత్వంలో అవినీతి, ప్రభుత్వం పైన వ్యతిరేకత అంశాల ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఇక్కడ మహిళల ఓటింగ్ కీలకం కానుంది. మహిళలు మెజార్టీ శాతం ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల్లో ఎన్ని గెలుస్తుందనేది కూటమికి కీలకంగా మారుతోంది.

sas-opinion-poll-reveals-key-factors-ahead-of-bihar-first-phase-elections

కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిస్తే ఖచ్చితంగా కూటమికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఏర్పడు తుందని విశ్లేషణ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ కిశోర్ కు దక్కే ప్రతీ పది ఓట్లలో ఏడు ఎన్డీఏ నుంచి.. మూడు కూటమి నుంచి బదిలీ అయ్యే అవకాశం ఉంది. కాగా, సీట్ల విషయంలో మాత్రం ప్రశాంత్ కిషోర్ కు నిరాశ తప్పదనే అంచనాలు వస్తున్నాయి. మహిళల ఓటింగ్ తమ నుంచి దూరం కాకుండా పోల్ మేనేజ్ మెంట్ ఎన్డీఏ చేసుకుంటే గెలుపు వారిదేనని అంచనా వేస్తున్నారు. అదే విధంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు.. గ్రామీణ ఓటర్లు ఇప్పుడు మహా ఘట్ బందన్ కు బలంగా మారుతున్నారు. ఇక.. ఓటింగ్ శాతం తో పాటుగా ఈబీసీ.. ఎంబీసీ వర్గాల మద్దతు సైతం కీలకంగా మారుతోంది. ఎవరు గెలిచినా.. రెండు కూటముల మధ్య సీట్ల తేడా స్వల్పంగానే ఉంటుందని ఎస్ఏఎస్ సంస్థ అంచనా వేస్తోంది. ఇక సీట్ల ప్రకారం ఈ సంస్థ మహా ఘట్ బంధన్ కు 109-120 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఎన్డీఏకు 107-116 మధ్య వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషించింది. దీంతో.. ఈ హోరా హోరీ పోరులో తుది విజేత ఎవరనేది 14న తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+