బీహార్ లో గెలుపు వారిదే, తేల్చేసిన ప్రముఖ సర్వే- ఎన్డీఏలో వాట్ నెక్స్ట్..!!

బీహార్ లో గెలుపు ఎవరివది. ఇప్పుడు ప్రతీ చోటా జరుగుతున్న చర్చ. బీహార్ ఎన్నికల తరువాత ఎన్డీఏ తో పాటుగా.. జాతీయ స్థాయిలో రాజకీయంగా సమీకరణాలు మారుతాయనే చర్చ ఉంది. ఇదే సమయంలో బీహార్ లో గెలుపు పైన రెండు కూటములు ధీమాతో ఉన్నాయి. కేంద్రంలో అధికారం లో ఉన్న ఎన్డీఏకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అయితే, ప్రముఖ సర్వే సంస్థ ఎస్ఏఎస్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు లోకి వచ్చాయి. పబ్లిక్ మూడ్ తో పాటుగా పార్టీల బలాబలాలను వెల్లడించింది.

బీహార్ అసెంబ్లీకి ఈ వారంలోనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీహార్ లో ప్రచారం తారా స్థాయికి చేరింది. ఎన్డీఏ - ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల మహా ఘట్ బంధన్ ల మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ సంస్థ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 15 మధ్య కాలంలో ఈ సర్వే చేసింది.
ఆ సమయంలో ఎన్డీయే కూటమికి 125 సీట్లు మహా ఘట్ బంధన్ కి 110 సీట్లు వస్తాయని అంచనా కట్టారు. కానీ సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 2 వరకూ నిర్వహించిన తాజా విడత ప్రీ పోల్ సర్వేలో మహా ఘట్ బంధన్ పరిస్థితి మెరుగుపడినట్లు గుర్తించారు. తాజాగా చేసిన సర్వేలో బీహార్ లో సీట్లు 243 ఉంటే అందులో ఎన్డీయే కూటమికి 104 నుంచి 115 దాకా వస్తాయని తాజాగా ఎస్ఏఎస్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది.

SAS Survey reveals key factors in Bihar ahead assembly Elections seems keen contest

కాగా, మహా ఘట్ బంధన్ కి 116 నుంచి 125గా వస్తాయని తేలింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీకి 11 నుంచి 14 దక్కుతాయని తేలింది. ఇక ఇతరులకు ఏడు నుంచి తొమ్మిది సీట్లు వస్తాయని అంచనాలు వెల్లడించారు. రాష్ట్రంలోని తొమ్మది డివిజన్లలో ఈ సర్వే చేసినట్లు వివరించారు. రాహుల్ యాత్ర ప్రభావం పైనా ఈ సర్వేలో ఆరా తీసారు. 39 శాతం మంది రాహుల్ యాత్ర మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇక.. తాజాగా నితీశ్ ప్రభుత్వం ప్రకటించింది. రోజ్ గార్ యోజన పధకం ద్వారా ఇచ్చింది. ఆ తరువాత మహిళా ఓటర్ల ప్రభావం కీలకంగా మారుతోంది. మహిళా ఓటింగ్ లో మూడు శాతం మాత్రమే తేడా కనిపిస్తోంది. ప్రశాంత్ కిశోర్ ప్రభావం పైన ఆసక్తి నెలకొంది.

ఇక.. నితీశ్ పని తీరు పైన 29 శాతం మంది సంతృప్తిగా ఉందని అభిప్రాయపడ్డారు. సీఎం గా మహాఘట్ బంధన్ నుంచి తేజస్వీ యాదవ్ కి 37 శాతం మంది మద్దతుగా ఉంటే నితీష్ కుమార్ కి 22 శాతం మద్దతు దక్కింది. ముస్లిం ఓటర్లు మహా ఘట్ బంధన్ కి 70 శాతం మంది ఎన్డీయేకు 21 శాతం మంది అనుకూలంగా ఉన్నట్లు సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, పొత్తుల లెక్కలు.. అభ్యర్ధులు... ప్రచారం ప్రస్తుతం నెలకున్న హోరా హోరీ పోరులో కీలకంగా మారనున్నాయి. బీహార్ ఫలితం ఎన్డీఏ నాయకత్వం.. తరువాత ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన ప్రభావం చూపించటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+