అంతా నా భర్త వల్లే, చేయి దాటింది..: శశికళ ఆగ్రహం, మోడీతో యుద్ధమే!
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తన భర్త నటరాజన్‌పై, అలాగే దినకరన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పరప్పన అగ్రహార జైలులో ఉన్న చిన్నమ్మను ఆమె న్యాయవాది కలిశారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తన భర్త నటరాజన్‌పై, అలాగే దినకరన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పరప్పన అగ్రహార జైలులో ఉన్న చిన్నమ్మను ఆమె న్యాయవాది కలిశారు.
చదవండి: తమిళనాడులో కొత్త బాహుబలి
ఈ సమయంలో ఆమె తన భర్త పైన తీవ్ర అసనహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితికి (ఇబ్బందులు) అంతటికీ తన భర్తనే కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఆయన వల్లే రాజకీయాల్లోకి..
తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తన భర్త నటరాజన్ కూడా ప్రధాన కారణమని, తానన ఎంట్రీకి ఆయనే ముఖ్య కారణమని, తదనంత పరిణామాలు, ఇప్పుడు తాను జైలులో ఉండటం.. ఇలా అన్నింటికి తన భర్త కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఇప్పుడు కుటుంబమంతా చిక్కుల్లో...
తన భర్త కారణంగా ఇప్పుడు కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో ఉందని శశికళ ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. జయలలిత మృతి చెందినప్పటి నుంచి పరిణామాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారని తెలుస్తోంది.

బీజేపీకి ఎదురు తిరిగి..
జయలలిత మృతి చెందిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై వచ్చిన విషయం తెలిసిందే. జయ మృతి నేపథ్యంలో అన్నాడీఎంకే ద్వారా తమిళనాట ఎదగాలని బీజేపీ భావించింది. ఇందులో భాగంగానే మోడీ.. శశికళను, పన్నీరుసెల్వంను ఊరడించారు.
ఆ తర్వాత పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. శశికళ సొంత గ్రూప్ ఏర్పడటం, ఆ తర్వాత సుప్రీం కోర్టు తీర్పుతో ఆమె జైలుకు వెళ్లడం జరిగింది. దీంతో శశికళ వర్గం బీజేపీకి దూరమైంది. మరోవైపు పన్నీరుసెల్వం వర్గం బీజేపీకి దగ్గరయినట్లుగా కనిపించింది. అప్పటి నుంచి శశికళకు, ఆమె ఫ్యామిలీకి చిక్కులు ప్రారంభమయ్యాయి.

దినకరన్ పైనా శశికళ ఆగ్రహం
జైల్లో ఉన్న శశికళ.. దినకరన్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమయంలో దినకరన్ హడావుడి, పార్టీలో చక్రం తిప్పాలనుకోవడం మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టిందని శశికళ అభిప్రాయపడుతున్నారు. పోటీ కోసం, అలాగే లంచం విషయంలో దినకరన్ హడావుడి లేకుంటే అరెస్టు కాకపోయి ఉండేవారని శశికళ భావిస్తున్నారట.

నాతో చర్చించకుండానే..
ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం తనతో చర్చించకుండానే దినకరన్ తనకు తానుగా.. అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ పాలన అంటూ పార్టీలోనే కొందరు ఎదురు తిరిగారని శశికళ ఆవేదన వ్యక్తం చేశారు.

పొలిటికల్ యుద్ధం తప్పదు
జయలలిత మృతి.. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాజకీయ యుద్ధం తప్పదని శశికళ భావిస్తున్నారని తెలుస్తోంది. పోరు లేకుంటే మరింత ఇబ్బందుల్లో పడతామని ఆమె భావిస్తున్నారంటున్నారు.

బీజేపీతో సఖ్యత.. కానీ.. పరిస్థితి చేయి దాటింది
బీజేపీతో సఖ్యతగా ఉండి సమస్యల నుంచి బయట పడే పరిస్థితి ప్రస్తుతం లేదని శశికళ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పరిస్థితి చేయి దాటిందని శశికళ భావిస్తున్నారట. పన్నీరుసెల్వం వర్గం బీజేపీకి దగ్గరగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పోరు సాగించడమే మిగిలి ఉందని ఆమె భావిస్తున్నారట. ఇప్పుడు ఫైట్ చేయాల్సిందేనని భావిస్తున్నారంటున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications