తమిళనాట కొత్త బాహుబలి!: అభిమానుల ఉత్సాహం

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ప్రస్తుతం దేశమంతటా బాహుబలి మేనియా నడుస్తోంది. ఈ సినిమా గత శుక్రవారం విడుదలయింది. విడుదలకు ముందు నుంచే అది రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల వరద సృష్టిస్తోంది.

అందరినీ ఆకట్టుకుంటున్న బాహుబలిని మన రాజకీయ నాయకులు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, నాటి సీఎం హరీష్ రావత్ (ఇప్పుడు మాజీ సీఎం)ను ఉత్తరాఖండ్ బాహుబలిగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. అయినప్పటికీ ఆ పార్టీ అక్కడ ఘోర పరాజయం చవి చూసింది.

bahubali

ఇటీవల కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు బాహుబలి సినిమాను ప్రశంసించారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు తెలిసిన బాహుబలి ఒక్కరేనని, అది నరేంద్ర మోడీ అని, నరేంద్ర బాహుబలి అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇప్పుడు తమిళనాడు కూడా బాహుబలిని ఉపయోగించుకుంటున్నారు. అన్నాడీఎంకేలో చీలిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దినకరన్, జయంత్ మద్దతుదారులు తమ నేతలను బాహుబలిగా చిత్రీకరిస్తూ ఫోటోలు పెడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dinakaran and Jayananth supporters have dubbed their leader as Bahubali as the Bahubali mania grips the politics too.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి