పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు దేశీయ ఇంధన రంగాన్ని కమ్మేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. చమురు సరఫరా చైన్ దెబ్బతినడంతో దేశీయంగా కొరత తలెత్తకుండా ప్రభుత్వం ఒకేసారి రెండు కీలక అస్త్రాలను ప్రయోగించింది. ఒకవైపు 'అత్యవసర వస్తువుల చట్టం' (ECA) ద్వారా వంటగ్యాస్ (LPG) ఉత్పత్తిని పెంచాలని ఆదేశించగా, మరోవైపు పెట్రోల్, డీజిల్ రవాణాలో అంతరాయాలు కలగకుండా 'ఎస్మా' (ESMA) చట్టాన్ని అమలు చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ ముందస్తు చర్యల ద్వారా సామాన్యుడి వంటింటిపై, రవాణా వ్యవస్థపై భారం పడకుండా చూడటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
దేశంలో ఎల్పీజీ కొరత రాకుండా ఉండేందుకు కేంద్రం 'అత్యవసర వస్తువుల చట్టాన్ని' అమల్లోకి తెచ్చింది. చమురు శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు),పెట్రోకెమికల్ యూనిట్లు తమ ప్రాధాన్యతను మార్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర హైడ్రోకార్బన్ విభాగాల కంటే ఎల్పీజీ తయారీకే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించింది. రాబోయే ఆరు నెలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సహజ వాయువు (Natural Gas) సరఫరాలో గృహ అవసరాలకు వాడే పైపుడ్ గ్యాస్ (PNG), రవాణాకు వాడే సీఎన్జీ (CNG) మరియు ఎల్పీజీ ఉత్పత్తి విభాగాలకు 100 శాతం కేటాయింపులు చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

పరిశ్రమలకు కోత.. సామాన్యుడికి ప్రాధాన్యత
పరిస్థితి తీవ్రతను బట్టి ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై వర్గీకరణ చేపట్టింది. ఎరువుల కర్మాగారాలకు 70 శాతం, టీ పరిశ్రమలు, ఇతర తయారీ రంగాలకు 80 శాతం మాత్రమే గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించింది. చమురు శుద్ధి సంస్థలు కూడా తమ స్వంత వినియోగాన్ని 65 శాతానికి తగ్గించుకోవాలని సూచించింది. ప్రతి గ్యాస్ ఉత్పత్తిదారు, దిగుమతిదారు.. పంపిణీదారు తమ వద్ద ఉన్న నిల్వలు.. సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదించాలని ఆదేశించడమే కాకుండా, ఎల్‌ఎన్‌జీ (LNG) దిగుమతుల్లో తలెత్తే అంతరాయాలను తట్టుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది.
బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం.. 25 రోజుల బుకింగ్ రూల్
కేవలం సరఫరాను పెంచడమే కాకుండా, నిల్వలను అరికట్టడానికి, బ్లాక్ మార్కెట్ ను అరికట్టడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిబంధనను ప్రవేశపెట్టింది. ఇకపై వినియోగదారులు వరుసగా గ్యాస్ సిలిండర్లను బుక్ చేయడానికి వీలుండదు. రెండు బుకింగ్‌ల మధ్య కనీసం 25 రోజుల విరామం ఉండాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పౌరుల శక్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎల్పీజీ ఉత్పత్తిని గృహ అవసరాలకు మళ్లించేలా మంత్రిత్వ శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది.
ఎస్మా (ESMA) అంటే ఏమిటి? ఎందుకు ఈ కఠిన నిర్ణయం?
ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో రవాణా రంగంలో సమ్మెలు లేదా నిరసనలు తలెత్తితే దేశం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకే ప్రభుత్వం 'అత్యవసర సేవల నిర్వహణ చట్టం' (ఎస్మా)ను ప్రయోగించింది. ఎస్మా అమలులో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే సిబ్బంది లేదా ట్యాంకర్ ఆపరేటర్లు సమ్మె చేయడం చట్టవిరుద్ధం. విధులకు హాజరుకాకుండా ఆటంకం కలిగిస్తే పోలీసులు వారిని వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం ఈ చట్టం కల్పిస్తుంది. సాధారణంగా ప్రజా జీవనం గందరగోళంలో పడకుండా చూసేందుకు, నిత్యావసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ శక్తివంతమైన చట్టాన్ని అమలు చేస్తుంది.
Government of India invokes the Essential Commodities Act, 1955, to regulate the availability, supply and equitable distribution of petroleum and petroleum products and natural gas pic.twitter.com/OqtsDwb13s
— ANI (@ANI) March 10, 2026
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక! -
వాహనదారులకు భారీ ఉపశమనం? -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
నానాటికీ తగ్గుతున్న పెట్రోల్ `మార్జిన్లు` -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications