Bigg Boss Telugu 10: శ్రీముఖిని పొగిడితేనే ఎంట్రీ - ప్రారంభంకు ముందే కాంట్రవర్శీ.!
బిగ్‌బాస్..బుల్లితెరను ఊపేస్తున్న రియాలిటీ షో.దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ రియాలిటీ షో అక్కడి వీక్షకులను కట్టిపడేస్తోంది. అనతికాలంలోనే ఎంతగా పాపులర్ అయ్యిందో అంతే వేగంగా వివాదాలు ఈ మెగా రియాల్టీ షోను చుట్టుముట్టాయి. ఇక తెలుగులో ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. గత కొన్ని సీజన్లుగా నాగార్జు మాత్రమే ఈ షోను చక్కగా క్యారీ చేయగలరనే అభిప్రాయం కూడా ఉంది. ఇక త్వరలో తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 10 ప్రారంభం కాబోతోంది.ఏటా కొత్త కాన్సెప్ట్ లేదా థీమ్ ద్వారా కంటెస్టెంట్ల ఎంపిక ఉంటుంది. ఈసారి కూడా బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ద్వారా కొంతమంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు వివాదాలు ఈ షో చుట్టూ అలుముకున్నాయి.
కాంట్రవర్శీ బిగిన్స్..
మరి కొద్ది రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కాబోతోంది. అంతకంటే ముందు అగ్నిపరీక్ష అనే ప్రత్యేక కాన్సెప్ట్ ద్వారా కొంతమంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ అగ్నిపరీక్షకు జడ్జీలుగా గతంలో బిగ్‌బాస్ కంటెస్టంట్లుగా వచ్చిన పలువురు సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారు. వీరిలో నవదీప్,బిందు మాధవి, అభిజీత్‌లు జడ్జీలుగా ఉండగా...షోకు హోస్ట్‌గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. ఇక కంటెస్టెంట్లు తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు పోటీదారులు అగ్నిపరీక్షలో పాల్గొని రిజెక్ట్ కూడా అయ్యారు. ఇక్కడే కాంట్రవర్శీ క్రియేట్ అయ్యింది. జడ్జీలుగా ఉన్నవారు సరైన జడ్జిమెంట్ ఇవ్వడం లేదని.. కావాలనే రిజెక్ట్ చేస్తున్నారని పలువురు కంటెస్టెంట్లు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీముఖిని పొగడాలంటా..
బిగ్‌బాస్‌లో పాల్గొనడం తమ డ్రీమ్ అని ఒక కంటెస్టెంట్ చెప్పుకొచ్చాడు. ఇందుకోసం తానెంతో కష్టపడినట్లు చెప్పుకున్నాడు. అయితే అగ్నిపరీక్ష స్టేజ్ ఎక్కగానే తాను నవదీప్, బిందుమాధవి, అభిజిత్‌లు కంటెస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్లు చూసినట్లు తెలిపాడు. అయితే అక్కడే హోస్ట్‌గా ఉన్న శ్రీముఖి కంటెస్ట్ చేసిన బిగ్‌బాస్ షోను చూడలేదని స్ట్రెయిట్‌గా చెప్పడంతో...శ్రీముఖి ఆగ్రహంతో ఊగిపోయి స్టేజ్ దిగిపోయిందని సదరు కంటెస్టెంట్ పేర్కొన్నాడు. దీంతో ఆమె తనను రిజెక్ట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అసలు బిగ్‌బాస్‌లో పాల్గొనాలంటే ముందుగా ఉండాల్సింది డేరింగ్ అండ్ ముక్కు సూటి వ్యవహారశైలి. జడ్జీలను పొగడాలి, పులిహోర కలపాలి, భజన చేయాలంటే కుదరదని, అలాంటి వారినే తీసుకుంటున్నారా అనే దానిపై నిర్వాహకులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాడు. శ్రీముఖిని పొగడలేదు కాబట్టి ఆమె రెడ్ ఇచ్చారని, అప్పటికే నవదీప్ తనకు గ్రీన్ ఇచ్చేందుకు ప్రయత్నించగా శ్రీముఖి హైజాక్ చేసిందని వెల్లడించాడు.తన టాలెంట్ ను టెస్ట్ చేయకుండా.. కేవలం పొగలేను అని శ్రీముఖితో నిర్మొహమాటంగా చెప్పడం వల్లే తాను రిజెక్ట్ అయినట్లు భాదను వ్యక్తపరిచాడు.
జపాన్ భాష మాట్లాడితే సెలెక్టా..?
ఇక మరో కంటెస్టెంట్ నిఖిల్ కూడా తన బాధను పంచుకున్నాడు. అగ్నిపరీక్ష కోసం టాప్ టాలెంటెడ్ ఇన్ఫ్లుయెన్సర్లను పిలిచారని అయితే వారందరినీ జస్ట్ పిలిచి రిజెక్ట్ చేశారని నిఖిల్ తెలిపాడు. ఇక సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉప్పల్ బాలును కూడా పిలిచి రిజెక్ట్ చేశారని గుర్తు చేశారు.ఇదంతా ఇలా ఉంటే మరో కంటెస్టెంట్ ఫుటూ అనే వ్యక్తి జపాన్ నుంచి వచ్చాడని, జపనీస్ మాట్లాడుతుండటంతో అతన్ని సెలెక్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి పరాయి భాష మాట్లాడే వ్యక్తులను సెలెక్ట్ చేసే పాటయితే తాను కూడా కిలికిలి భాషను మాట్లాడగలనని సెటైర్ వేశాడు.
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో బోగస్ డ్రామా జరుగుతోందని టైమ్ వేస్ట్ చేసుకోవద్దని నిఖిల్ చెప్పాడు. కొందరు బిగ్ బాస్ కోసం ఉద్యోగాలు వదిలేసుకుని, సుదూర ప్రాంతం నుంచి రావడం జరిగిందని చెప్పారు. ఫలానా కంటెస్టెంట్లు అని ముందుగానే ఫిక్స్ అయి ఉంటే అగ్నిపరీక్ష కోసం వారినే తీసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అగ్నిపరీక్ష కోసం వచ్చిన కంటెస్టెంట్లను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో సరైన కారణం చెప్పడం లేదని చాలా మంది రిజెక్ట్ అయిన పోటీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అందుకే సోషల్ మీడియా వేదికగా అసలు బిగ్‌బాస్ కాన్సెప్ట్ ఏంటి, ఎవరికోసం, ఎందుకోసం,ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, అని సామాన్య వీక్షకులకు వాస్తవాలు చెప్పేందుకు తాము వీడియోలు చేస్తున్నట్లు కంటెస్టెంట్లు చెబుతున్నారు. మొత్తానికి ప్రారంభానికి ముందే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10ను కాంట్రవర్శీలు చుట్టుముట్టాయి. మరి నాగార్జున గారు మీరు వీరి బాధలను వింటున్నారా..?














Click it and Unblock the Notifications