జెడ్పీ ఛైర్మన్లుగా మజ్జిసిరి, పరిటాల శ్రీరామ్ - టీడీపి జాబితా ప్రకటన: బీజేపీ, జనసేనకు ఇలా..!!

ఏపీలో కొత్త జెడ్పీ ఛైర్మన్లు ఖరారయ్యారు. అర్ద్రరాత్రి వరకు కూటమి నేతల మధ్య సాగిన చర్చల తరువాత మూడు పార్టీల మధ్య జెడ్పీ సీట్ల సర్దుబాటు పూర్తయింది. నాలుగు జిల్లాలు జనసేనకు, ఒకటి బీజేపీకి కేటాయించారు. 22 జిల్లాల జెడ్పీ ఛైర్మన్లను జాబితాను టీడీపీ ప్రకటించింది. కాగా, తొలి నుంచి సస్పెన్స్ గా మారిన మజ్జి సిరి, పరిటాల శ్రీరామ్ కు జెడ్పీ పీఠాలు దక్కాయి. ఈ రోజు వీరంతా కొత్త జిల్లా పరిషత్ ఛైర్మన్లు బాధ్యతలు స్వీకరించనున్నారు.

స్థానిక ఎన్నికల్లో కూటమికి 27 జెడ్పీ ఛైర్మన్లు.. వైసీపీకి ఒక్క స్థానం దక్కాయి. కూటమిలో సీట్ల సర్దు బాటులో భాగంగా అర్ద్రరాత్రి వరకు జరిగిన చర్చల్లో 4 జిల్లాలు జనసేనకు, ఒకటి బీజేపీకి దక్కగా... మిగిలిన 22 స్థానాల్లో టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర ఎన్ని కల కమిషన్‌ విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం... శుక్రవారం జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక జరగాల్సి ఉంది. ఎన్నికల్లో గెలిచిన జడ్పీటీసీలు పరోక్ష పద్ధతిలో వీరిని ఎన్నుకుంటారు. విజయనగరం జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి మజ్జి సిరిసహస్రను వరించింది. సత్యసాయి జడ్పీ పదవికి పరిటాల రవి, సునీతల కుమారుడు శ్రీరామ్‌ను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుమార్తె సాయి నవ్యశ్రీని ఏలూరు పీఠంపై కూర్చోబెట్టారు. అన్నమయ్య జడ్పీ సారథిగా సీనియర్‌ నేత పాలకొండ్రాయుడి కుమారుడు ప్రసాద్‌బాబుకు చాన్స్‌ దక్కింది. కాగా, అనూహ్యంగా కృష్ణా జిల్లా జెడ్పీ పీఠం బీజేపీకి దక్కింది. జనసేనకు అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపరం మన్యం, కాకినాడ జెడ్పీ పీఠాలు దక్కాయి.

 అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం, టోకెన్లు జారీ ఇలా..!!
అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం, టోకెన్లు జారీ ఇలా..!!
zp-chairperson-seats-finalised-in-alliance-tdp-announces-new-chairpersons-here-the-list-details-h

అర్ద్రరాత్రి వరకు చర్చలు.. తుది జాబితా

కాగా.. జడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల కేటాయింపులో టీడీపీ బీసీలకు పెద్దపీట వేసింది. 6 చైర్‌ పర్సన్లను, 11 వైస్‌ చైర్‌పర్సన్లను ఆ వర్గాలకు కేటాయించింది. ఎస్సీలకు 5 చైర్‌ పర్సన్లు, 1 వైస్‌ చైర్‌పర్సన్‌... ఎస్టీ, మైనారిటీలకు ఒక్కో చైర్‌పర్సన్‌, రెండేసి వైస్‌ చైర్‌పర్సన్లు దక్కాయి. ఓసీలకు 9 చైర్‌ పర్సన్లను, 4 వైస్‌ చైర్‌పర్సన్లను కేటాయించారు. టీడీపీ జడ్పీ ఉపాధ్యక్షులుగా శ్రీకాకుళం-గుంటు విజయ్‌కుమార్‌, విజయనగరం-పసల నీరజ, పార్వతీపురం మన్యం-వైరిచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌, విశాఖపట్నం-సుకవాసి అజయ్‌, అనకాపల్లి-పెంటకోట స్వాతి, కాకినాడ-పిల్లి అనంతలక్ష్మి, పశ్చిమ గోదావరి-సిరగాని నాగేశ్వరరావు, పోలవరం-తీగల ప్రభ, ఏలూరు-బొర్రా చలమయ్య, కృష్ణా-దండమూడి పూజిత, గుంటూరు-తల్లా అశోక్‌కుమార్‌, పల్నాడు-నల్లపాటి కీర్తన, మార్కాపురం-జీవీ శ్రీనివాసవర్మ, నెల్లూరు-పొట్టేళ్ల ప్రసాద్‌, కర్నూలు-షేక్‌ షాదిక, నంద్యాల-కె.శ్రీకాంత్‌రెడ్డి, అనంతపురం-వెన్నపూస లలితను ఖరారు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+