Bigg Boss 10: అగ్నిపరీక్ష టాప్ 15 కంటెస్టెంట్లు వీరే.. ఎవరెవరున్నారంటే?

Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షో ప్రారంభం కాక ముందు నుంచే బిగ్‌బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తారు.. ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు? అంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకంటున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 10 సందడి మొదలు కానుంది. దానికి ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్షతో హీటెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. రెండో సీజన్ అగ్నిపరీక్ష ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుండగా.. అప్పుడే లీకులు కూడా వచ్చేశాయి. ఈ సారి వచ్చిన వేల దరఖాస్తుల నుంచి దాదాపు 70 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Ramayana: రామాయణ చిత్రంలో బిగ్ ట్విస్ట్: ఒకే నటుడు, ఏడు క్యారెక్టర్లు!
Ramayana: రామాయణ చిత్రంలో బిగ్ ట్విస్ట్: ఒకే నటుడు, ఏడు క్యారెక్టర్లు!

ఆ 70 మంది నుంచి టాప్ 15 కంటెస్టెంట్లను అగ్నిపరీక్ష కోసం ముగ్గురు జడ్జ్ లు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ 15 మంది నుంచి చివరకు ఐదారు మందిని మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిస్తారనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన 'అగ్నిపరీక్ష' ప్రోమో ఈ ఉత్కంఠను మరింత పెంచింది. జడ్జీలుగా మరోసారి బిందు మాధవి, నవదీప్, అభిజీత్ కంటెస్టెంట్లను తమదైన స్టైల్లో టెస్ట్ చేస్తున్నారు. శ్రీముఖి కూడా తన కామెంట్లతో షోకు మరింత ఎనర్జీని తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది.

Bigg Boss 10 Agnipareeksha Top 15 Contestants List Leaked Online Check out the shortlisted contestants

బిగ్ బాస్ షో అంటేనే అంతా లీకుల మయం అన్నట్టుగా సాగింది. బిగ్ బాస్ షో అప్డేట్లు అన్నీ కూడా ముందుగానే బయటకు వస్తుంటాయి. నామినేషన్స్, ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డుల ఇలా అన్నీ కూడా ముందుగానే లీక్ వుతుంటాయి. ప్రతీ సీజన్‌కి ఈ లీకుల బెడద అనేది తప్పదు. ఇక ఇప్పుడు ఈ కష్టం అగ్ని పరీక్ష టీంకి కూడా వచ్చినట్టుంది. ఇంకా అగ్ని పరీక్ష ప్రసారమే కాలేదు.. అప్పుడే లీకులు కూడా వచ్చేశాయి. 70 మంది అగ్ని వారియర్స్ నుంచి టాప్ 15 కంటెస్టెంట్లను ముగ్గురు జడ్జ్‌లు ఫైనల్ చేశారు. ఆ 15 మంది నుంచి చివరకు ఐదారు మందిని మాత్రమే బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తారన్న సంగతి తెలిసిందే.

సూర్య మూవీ.. 'విశ్వనాథ్ & సన్స్’ మొదటి రివ్యూ
సూర్య మూవీ.. 'విశ్వనాథ్ & సన్స్’ మొదటి రివ్యూ

ఇదిలా ఉండగా.. అగ్నిపరీక్ష టాప్ 15 కంటెస్టెంట్లు లిస్ట్ నెట్టింట వైరలవుతోంది. రాజ కుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మితిలేష్, శ్రష్టి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు మావా ఆర్కే, భాగి తల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వ తదితరులు అంతా కూడా అగ్నిపరీక్షలో టాప్ 15 కంటెస్టెంట్లుగా నిలిచారని సమాచారం. ఇక ఇందులోంచి బిగ్ బాస్ పదో సీజన్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు ఎవరనేది మాత్రమే ఇప్పుడే తెలియదు. బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే రెండు, మూడు రోజుల ముందే ఈ టాప్ కంటెస్టంట్లను ఎంచుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+