Warner Bros ను దక్కించుకునేందుకు.. CNN వదిలించుకుని.. పారామౌంట్ మాస్టర్ ప్లాన్..!

పారామౌంట్ స్కైడాన్స్ సంస్థ.. వార్నర్ బ్రోస్ డిస్కవరీని $110 బిలియన్ డాలర్లకు కొనుగోలు, విలీనం చేసే డీల్ లో భాగంగా వార్నర్ బ్రోస్ వద్ద ఉన్న సీఎన్ఎన్ న్యూస్ నెట్ వర్క్ సంస్థను విక్రయించే యోచనలో ఉన్నట్లు పారామౌంట్ స్కైడాన్స్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే పారామౌంట్ వద్ద సీబీఎస్, సీబీఎస్ న్యూస్ ఉండగా ఇప్పుడు సీఎన్ఎన్ కూడా తోడైతే ఇంటర్నేషన్ మీడియా మొత్తం దాదాపు ఒకే సంస్థ గొడుగు కిందకు వచ్చే అవకాశం ఉంది. దాంతో అమెరికాలోనే రెండు అతిపెద్ద వార్తా సంస్థలను కంట్రోల్ చేసే సంస్థగా పారామౌంట్ అవతరిస్తుందని ఇది పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా పరిగణించాలని కోరుతూ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ నేతృత్వంలో 12 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.

ఈ విలీనం కారణంగా మీడియా రంగంలో పోటీతత్వం తగ్గుతుందని.. ధరలు పెరుతాయని అమెరికాలోని 12 రాష్ట్రాల ప్రతినిధులు వాదిస్తున్నారు. ఈ మేరకు కోర్టులో లా సూట్ ను ఫైల్ చేశాయి. ఈ నేపథ్యంలో న్యాయ పరమైన అడ్డంకులను తొలగించుకునేందుకు సీఎన్ఎన్ వార్తా సంస్థను విక్రయించే యోచనలో ఉన్నట్లు పారామౌంట్ స్కై డాన్స్ సంస్థ లీగల్ అధికారి వెల్లడించారు. వార్నర్ బ్రోస్ సంస్థ విలీనంతో పారామౌంట్ సంస్థ మరింత విస్తరించనుంది. నెట్ ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్, యూట్యూబ్ లాంటి సంస్థలతో ఇది పోటీపడే అవకాశం ఉంది.

ఇదే అంశంపై ఒరాకిల్ సంస్థ అధినేత లారీ ఎల్లిసన్ మాట్లాడుతూ.. సీఎన్ఎన్ సంస్థను విక్రయించడం ఓ ప్రత్యామ్నాయంగా పారామౌంట్ సంస్థ భావిస్తోందని అన్నారు. రెగ్యూలేటరీ, లీగల్ సవాళ్లను అధిగమించేందుకు పారామౌంట్ ముందున్న మార్గాల్లో ఇదీ ఒకటని అభిప్రాయపడ్డారు. మరోవైపు వార్నర్ బ్రోస్ ను కొనుగోలు, విలీనం చేయాలంటే పారామౌంట్ సంస్థకు ప్రధాన అడ్డంకిగా సీఎన్ఎన్ ఉన్నట్లు ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. సీఎన్ఎన్ ను ఎలాగైనా త్యాగం చేసి వార్నర్ బ్రోస్ సంస్థను తమలో విలీనం చేసుకోవాలని పారామౌంట్ సంస్థ సిద్ధం అవుతోంది.

Paramount Skydance weighing a CNN deal Paramount s master plan offload CNN to acquire Warner Bros

ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంటర్ టైన్ మెంట్ రంగంలో వార్నర్ బ్రోస్ సంస్థ అగ్రగామిగా ఉంటోంది. వార్నర్ బ్రోస్ లో వార్నర్ బ్రోస్, హెచ్బీఓ, డీసీ, హారీ పోటర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సిరీస్ లు ఉన్నాయి. అలాగే చాలా సినిమాలు, టెలివిజన్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. వార్నర్ బ్రోస్ ను చేజిక్కించుకోవడం ద్వారా పారామౌంట్ సంస్థ స్థానం మరింత సుస్థిరం కానుంది. నెట్ ఫ్లిక్స్, డిస్నీ సంస్థలకు ఇది అతిపెద్ద సవాల్ గా మారనుంది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు వార్నర్ బ్రోస్ కు అనేక పెద్ద టెలివిజన్ నెట్ వర్క్స్, మీడియా ప్రాపర్టీస్ ఉన్నాయి. మూవీస్, స్పోర్ట్స్, టెలివిజన్ కంటెంట్ ఉంది. అందువల్ల ఎట్టిపరిస్థితిల్లోనూ వార్నర్ బ్రోస్ ను విలీనం చేసుకుని అవసరమైతే సీఎన్ఎన్ సంస్థను విక్రయించాలని పారామౌంట్ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+