స్టాలిన్ ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే మృతి.. సీఎం విజయ్ కు బిగ్ షాక్..
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఎన్నికల్లో టీవీకే తరఫున కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే వీఎస్. బాబు (75) కన్నుమూశారు. డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ ను ఓడించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అయితే ఆయన ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల సమయంలో చెన్నైలోని ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వీఎస్ బాబు కొలత్తూరు నియోజకవర్గం నుంచి మాజీ సీఎం స్టాలిన్ పై 8,795 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వీఎస్ బాబుకు మొత్తం 82,997 ఓట్లు రాగా.. స్టాలిన్ కు 74,202 ఓట్లు దక్కాయి. టీవీకే పార్టీలో చేరకముందు ఆయన అన్నాడీఎంకే పార్టీలో ఉన్నారు. అంతకుముందు 2006 నుంచి 2011 వరకు డీఎంకే తరఫున పురసవల్కమ్ లెజిస్లేటర్ గా పనిచేశారు.

ఇక శ్వాసకోశ సమస్యలతో ఆయన సెప్టెంబర్ 9 న చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. తొలుత ఆయన హెల్త్ కు సంబంధించి బులిటెన్ ను విడుదల చేసినా ఆ తర్వాత క్రమంగా హెల్త్ బులిటెన్ విడుదల కాకపోవడం గమనార్హం. ఆ తర్వాత డీఎంకేకు రాజీనామా చేసి 2016 లో అన్నాడీఎంకేలో చేరారు. ఇక విజయ్ పార్టీ ప్రకటించాక టీవీకేలో చేరారు. ఇక వీఎస్ బాబు మరణంతో టీవీకే పార్టీ అధినేత, సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications
