గన్నవరం టు వారణాసి, కోల్‌కతా: కొత్త విమాన సర్వీసులు ప్రారంభం, టైమింగ్స్...!!

వారణాసికి వెళ్లాలనుకొనే వారికి బిగ్ అప్డేట్. గన్నవరం నుంచి వారణాసికి విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ నుంచి వారణాసికి విమానాలు నడపాలనే అభ్యర్ధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వారణాసితో పాటుగా కోల్‌కతా కు నేటి నుంచి కొత్తగా సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ కొత్త సర్వీసులకు సంబంధించిన టైమింగ్స్ ను ఇండిగో అధికారులు వెల్లడించారు. ప్రయాణీకుల స్పందనకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయాలు అమలు చేస్తామని స్పష్టం చేసారు.

ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో గన్నవరం నుంచి కొత్త సర్వీసులను ప్రారంభించింది. అందులో బాగంగా గన్నవరం నుంచి ఆధ్యాత్మిక రాజధాని వారణాసి.. కోల్‌కతా కు నూతన సర్వీసు లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ నుంచి ఉత్తరాది, తూర్పు భారత నగరాలకు నేరుగా కనెక్టివిటీ పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు, పశ్చిమ బెంగాల్‌తో వ్యాపార సంబంధాలు ఉన్న వర్తకులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనంగా మారనుంది. వారంలో మూడు రోజులు అంటే ప్రతి మంగళవారం, గురువారం, శనివారాల్లో ఈ విమానాలు అందుబాటులో ఉంటాయని ఇండిగో స్పష్టం చేసింది. అదే విధంగా ప్రయాణీకుల స్పందన.. రద్దీకి అనుగుణంగా అవసరమైతే సర్వీసులను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని ఇండిగో ప్రతినిధులు స్పష్టం చేశారు.

 ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌లు, 'స్థానికం' వేళ అనూహ్య నిర్ణయం- పునర్విభజన ఇలా..!!
ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌లు, 'స్థానికం' వేళ అనూహ్య నిర్ణయం- పునర్విభజన ఇలా..!!
indigo-launched-direct-flight-services-connecting-vijayawada-international-airport-gannavaram-to-v

విమాన సర్వీసులు.. టైమింగ్స్

కాగా, ఈ విమానాల టైమింగ్స్ ను వెల్లడించారు. వారణాసి - విజయవాడ సర్వీస్ (6E 6501 ): మధ్యాహ్నం 3:55 గంటలకు వారణాసిలో బయలుదేరి, సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అదే విధంగా విజయవాడ - వారణాసి సర్వీస్ (6E 6502) : సాయంత్రం 6:20 గంటలకు విజయవాడలో బయలుదేరి, రాత్రి 8:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. ఇక... కోల్‌కతా కు వెళ్లే విమానాలు.. ఇదే 6E 6502 నెంబర్ గల ఫ్లైట్ విజయవాడ నుంచి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరి, వారణాసి మీదుగా రాత్రి 10:15 గంటలకు కోల్‌కతా చేరుకుంటుంది. కోల్‌కతా - విజయవాడ తిరుగు ప్రయాణం లో భాగంగా 6E 6501 నెంబర్ గల ఫ్లైట్ మధ్యాహ్నం 2:10 గంటలకు కోల్‌కతాలో బయలుదేరి, వారణాసి మీదుగా సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని వివరించారు. భవిష్యత్ లో మరిన్ని ప్రాంతాలకు సర్వీసులను ప్రారంభించేందుకు అధ్యయనం కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+